మన్మోహన్‌కి లేఖ రాస్తే.. ప్రధాని మోడీకి చేరింది: స్పందించారు
లక్నో: ఓ యువకుడు తన చెల్లెళ్ల పెళ్లికి ఆర్థిక సహాయం అందించమంటూ అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌కి లేఖ రాస్తే.. ఆ లేఖకు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆ లేఖను ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్ ప్రాంతానికి చెందిన మంజిత్ అనే యువకుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో రాసి పంపించాడు.
బులంద్ షహర్ ప్రాంతానికి చెందిన మంజిత్ అనే యువకుడు 15నెలల క్రితం(2014, జనవరి) తాను నిరుద్యోగి కావడంతో తన ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేయలేకపోతున్నానని, ఆర్థిక సాయంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కి ఓ లేఖ రాశాడు.

ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, నరేంద్ర మోడీ ప్రధాని కావడం జరిగాయి. జనవరిలో ఆ లేఖను చూసిన మోడీ.. ఆ యువకుడికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు. కాగా, ఆ యువకుడి కుటుంబసభ్యులు మాత్రం ఆనందపడలేదు.
ఇద్దరు చెల్లెళ్ల పెళ్లికి కనీసం రూ.7లక్షల దాకా ఖర్చు అవుతుందని, రూ.50వేలు ఏ మూలకీ సరిపోవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రధానిని రూ. 3.64లక్షల ఆర్థిక సాయంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరినట్లు మంజిత్ తెలిపారు.












Click it and Unblock the Notifications