వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Republic Day 2023 : ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ లో అన్నీ ప్రత్యేకతలే-ఇవన్నీ తొలిసారి ?

|
Google Oneindia TeluguNews

ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. కరోనా కారణంగా గత రెండేళ్లు గణతంత్ర వేడుకలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఈసారి అట్టహాసంగా వేడులకు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. అలాగే ఈసారి గణతంత్ర వేడుకల పరేడ్ లో పలు ప్రత్యేకతలు, ఇంకా చెప్పాలంటే తొలిసారిగా పలు అంశాలు ఇందులో దర్శనమివ్వబోతున్నాయి. అవేంటో ఓసారి చూసేద్దాం..

గురువారం జరిగే 74వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌ లో ఈసారి అనేక తొలి ప్రదర్శనలు జరగనున్నాయి. ఇందులో ఆర్మీ ఆయుధ వ్యవస్ధలతో పాటు పలు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ఉన్నాయి. రెండో ప్రపంచయుద్ధంలో వాడిన బ్రిటీష్ కాలం నాటి 25 పౌండర్ గన్ ల స్ధానంలో దేశీయంగా తయారైన 105ఎంఎం ఇండియన్ ఫీల్డ్ గన్స్ తో ఈసారి సెల్యూట్ ఉండబోతోంది. అలాగే ఈ దేశీయ తుపాకుల్ని గతేడాది స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా వాడినా రిపబ్లిక్ డేకు వాడటం ఇదే ప్రథమం.

this republic day parade to showcase several firsts- here are details..

ఈజిప్టు సైనిక బృందం,కొత్తగా రిక్రూట్ అయిన అగ్నివీర్స్ మొదటిసారిగా కవాతులో భాగం కానున్నారు. పాకిస్తాన్ తో
ఎడారి సరిహద్దులో కాపలాగా ఉన్న మహిళా సైనికులు, బీఎస్ఎఫ్ ఒంటెల బృందంలో భాగంగా ఉండబోతున్నారు. 'నారీ శక్తి'ని ప్రదర్శించే 144 మంది నావికుల నావికాదళానికి ఓ మహిళా అధికారి తొలిసారి నాయకత్వం వహించబోతున్నారు. నాలుగు దశాబ్దాలుగా సముద్ర దళానికి సేవలందించిన నేవీకి చెందిన IL-38 విమానం కవాతు కోసం చివరి టేకాఫ్‌తో చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కనుంది. IL-38, సముద్ర నిఘా విమానం, దాదాపు 42 సంవత్సరాల పాటు నౌకాదళానికి సేవలందించింది.

రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఉదయం 10.30 గంటలకు విజయ్ చౌక్ నుంచి కవాతు ప్రారంభమవుతుందని, ఎర్రకోట వరకు కవాతు కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు. కోవిడ్ పరిమితుల కారణంగా ఎర్రకోట వరకు కవాతు సాంప్రదాయ మార్గం తగ్గించారు. తొమ్మిది రాఫెల్ జెట్‌లు, స్వదేశీంగా ఉత్పత్తి చేసిన ప్రచంద్, మల్టీ-రోల్, లైట్ అటాక్ హెలికాప్టర్ ఫ్లై పాస్ట్‌లో పాల్గొన్న 44 విమానాలలో ఉండబోతున్నాయి.

ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ లో మొత్తం 23 శకటాలు ప్రదర్శన చేయబోతున్నాయి. ఇందులో రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 17, కేంద్రం నుంచి ఆరు శకటాలు ఉంటాయి. భారతదేశం యొక్క శక్తివంతమైన సాంస్కృతిక వారసత్వం, ఆర్థిక,సామాజిక పురోగతిని వర్ణించేవి ఇందులో ఉండబోతున్నాయి. అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మొదటిసారిగా ఒక శకటాన్ని ప్రదర్శించబోతోంది. గత సంవత్సరం రాజ్‌పథ్ పేరు మార్పు తర్వాత, కర్తవ్య పథ్ లో తొలి రిపబ్లిక్ డే వేడుకలు జరగబోతున్నాయి.

English summary
this year republic day celebrations in delhi to showcase several firsts including made in india products.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X