బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు బెదిరింపు కాల్.. చంపేస్తామని హెచ్చరిక!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారం ఇప్పుడు బాలీవుడ్ వర్గాలలో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు కృష్ణ జింకలను వేటాడిన కేసు నేపథ్యంలో పలుమార్లు లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ నుండి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి.
షారుఖ్ ఖాన్ కు బెదిరింపు కాల్స్
ఇక ఇటీవల మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య తర్వాత సల్మాన్ ఖాన్ సైతం చంపేస్తామంటూ మరో హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సల్మాన్ ఖాన్ భద్రతను పెంచడంతోపాటు సల్మాన్ ఖాన్ పైన బెదిరింపులకు పాల్పడిన బిఖారం జలరాం బెస్ట్ అనే వ్యక్తిని కర్ణాటకలో పోలీసులు అరెస్టు చేశారు. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ బాటలోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి.

చంపేస్తామని వార్నింగ్
తాము అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకపోతే హాని తలపెడతామంటూ ముంబై పోలీసులకు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే షారుఖ్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
చత్తీస్గడ్ లోని రాయపూర్ కు చెందిన వ్యక్తి పేరుపై సెల్ నంబర్
ఇక షారుఖ్ ఖాన్ విషయంలో వచ్చిన బెదిరింపు కాల్స్ పైన ఆరా తీసిన పోలీసులు ఆ ఫోన్ కాల్ చేసిన ఫోన్ నెంబర్ చత్తీస్గడ్ లోని రాయపూర్ కు చెందిన ఫైజన్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉందని గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించి సదరు వ్యక్తిని అరెస్టు చేయాలని పేర్కొన్నారు.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వారిని పట్టుకుంటామని వెల్లడి
ఇక స్థానిక పోలీసులు ఫైజన్ ఖాన్ ను ఈ మేరకు విచారణ జరపగా తన ఫోన్ నవంబర్ రెండవ తేదీన చోరీకి గురైందని వెల్లడించారు. దీనిపై తాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని ఆ వ్యక్తి పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆ ఫోన్ కాల్ వచ్చిన లొకేషన్ ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. త్వరలోనే అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ ను బెదిరించిన వారిని పట్టుకుంటామని చెబుతున్నారు. ఇక తాజా బెదిరింపు కాల్స్ నేపధ్యంలో షారుఖ్ ఖాన్ కు భద్రతను పెంచారు పోలీసులు.












Click it and Unblock the Notifications