Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంపేస్తాం.. కారు పేల్చేస్తాం.. మరోమారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామని మరోమారు బెదిరింపులు రావటం ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే అనేకసార్లు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు రాగా తాజాగా మరోమారు ఆయనకు బెదిరింపులు ఎదురయ్యాయి. ఈసారి ఆయన కారును పేల్చేస్తామని, సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడి ఆయనను చంపేస్తామని వర్లీ లోని ముంబై రవాణా శాఖ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ పంపించారు దుండగులు.

సల్మాన్ ఖాన్ కు మరోమారు బెదిరింపులు
ఇక ఈ ఘటనతో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరించిన గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మెసేజ్ ఎవరు చేశారు? ఎక్కడి నుంచి చేశారు? అన్న దానిపైన దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు ఆయనకు భద్రతను పెంచారు. ఇప్పటికే అనేకమార్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను చంపడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది.

Threatening message to kill Bollywood star hero Salman Khan once again

గతంలో ఐదుగురు నిందితుల అరెస్ట్
గత ఏడాది కూడా లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులు సల్మాన్ ఖాన్ కదలికల పైన నిఘా పెట్టినట్టు అందులో భాగంగానే ఆయనపై కుట్ర చేసినట్టు గుర్తించిన పోలీసులు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర చేసిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని చార్జ్ షీట్ దాఖలు చేశారు. అప్పుడు వేసిన చార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గతంలో సుపారీ ఇచ్చి చంపేందుకు ప్లాన్
నవీ ముంబై పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ప్రకారం సల్మాన్ ఖాన్ ను చంపాలని ప్రయత్నం చేసిన ఆ ఐదుగురికి బిస్టోయ్ గ్యాంగ్ తో సంబంధాలున్నాయి. వీరు సల్మాన్ ఖాన్ ను చంపేందుకు 25 లక్షల రూపాయల సుపారీకి ఒప్పుకున్నారని తేలింది. సల్మాన్ ఖాన్ కదలికలపైన ఫోకస్ పెట్టిన బిష్ణోయ్ గ్యాంగ్ ఆయన కారును చుట్టుముట్టి కాల్పులు జరపాలని, ఆయనను అంతమొందించాలని ప్లాన్ చేసింది.

ఏకే 47 కొనుగోలు, ఉత్తర అమెరికా నుండి బాలుడు
దీనికోసం పాకిస్తాన్ నుంచి ఏకంగా ఏకే 47, ఏకే 92, ఎమ్ 16 రైఫిల్స్, టర్కిష్ తయారు చేసిన జిగానా పిస్టల్ తో సహా పాకిస్తాన్ నుండి అధునాతన ఆయుధాలను కొనుగోలు చేసినట్టు ఛార్జ్ షీట్ లోపేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ ను చంపటం కోసం ఉత్తర అమెరికా నుండి ఒక బాలుడిని తీసుకువచ్చినట్టు, అతను ప్లానింగ్ అంతా పూర్తి చేసినట్టు పేర్కొన్నారు.

సల్మాన్ ఖాన్ పై 60 నుండి 70 మందితో రెక్కీ
బిస్టోయ్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు అప్పుడు పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్ కదలికలను గుర్తించడానికి బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఏకంగా అరవై నుండి డెబ్బై మందిని రంగంలోకి దించారని పేర్కొన్నారు. రాజస్థాన్లో కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు బయటకు వచ్చిన నాటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ ఆయనను టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ఆయనకు తరచూ చంపేస్తామని హెచ్చరికలు, బెదిరింపులు రావటం జరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+