ప్రపంచంలో అత్యంత సంపన్నులున్న నగరాల జాబితాలో భారతదేశంలోని బెంగుళూరుతో పాటు ఆ నగరాలకు స్థానం

ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు ఉన్న నగరాలలో భారతదేశంలోని మూడు నగరాలు స్థానం సంపాదించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లోని కోటీశ్వరుల సంఖ్యతో పాటు సంపద విలువపై ప్రముఖ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ హీన్లీ అండ్ పార్ట్నర్స్ నిర్వహించిన సర్వేలో భారత నగరాలు అత్యంత కోటీశ్వరులు ఉన్న నగరాలుగా గుర్తించబడ్డాయి.

అపర కుబేరులున్న నగరాలపై సర్వే
ఈ సర్వేలో అపర కుబేరులు ఉంటున్న ప్రముఖ యాబై నగరాల పేర్లను హెన్లీ అండ్ పార్ట్నర్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో యునైటెడ్ స్టేట్స్ కి చెందిన 11 నగరాలు ఉండగా భారతదేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలకు స్థానం దక్కింది. అత్యంత సంపన్నులు ఉన్న నగరాల జాబితాలో న్యూయార్క్ కు మొదటి స్థానం దక్కగా , ఈ నగరంలో 3,49, 500 మంది కుబేరులు నివసిస్తున్నట్టుగా సర్వే వెల్లడించింది.

Three cities in India have a place in the list of cities with the most wealthiest cities in the world

టాప్ వన్ లో న్యూయార్క్ నగరం
న్యూయార్క్ నగరంలోని ప్రతి 24 మందిలో ఒకరు కోటీశ్వరులు అయి ఉన్నారని సర్వే పేర్కొంది. గత పది సంవత్సరాలలో కోటీశ్వరుల సంఖ్య 48 శాతం పెరిగిందని సర్వే నివేదికలో వెల్లడించింది . 2013లో ప్రతి 36 మందిలో ఒకరి మాత్రమే సంపన్నులు ఉండేవారని, అయితే ప్రస్తుతం న్యూయార్క్ లో ప్రతి 24 మందిలో ఒకరు కోటీశ్వరులుగా ఉన్నారని పేర్కొంది..

టాప్ 5 లో ఉన్న నగరాలివే
ఇక అత్యంత సంపన్నులు ఉన్న నగరాలలో రెండవ స్థానంలో బే ఏరియా టెక్ హబ్ ఉందని అక్కడ 3,5700 మంది కుబేరులు ఉన్నారని సర్వే వెల్లడించింది. ఇక మూడవ స్థానంలో 2, 98,300 మంది సంపన్నులతో టోక్యో నిలిచింది. తర్వాత నాల్గవ స్థానంలో సింగపూర్, ఐదవ స్థా స్థానంలో రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది సంపన్నులతో లండన్ నిలిచింది.

Three cities in India have a place in the list of cities with the most wealthiest cities in the world

భారత్ లో మూడు నగరాలకు చోటు
భారతదేశంలోని బెంగళూరు 13,200 మంది సంపన్నులతో టాప్ 50లో స్థానం సంపాదించగా, బెంగళూరుతో పాటు ఢిల్లీ, ముంబైలలో కూడా ఎక్కువమంది సంపన్నులు ఉన్న నగరాలుగా స్థానం దక్కించుకున్నాయి. ప్రపంచంలోనే సంపన్నులు ఉన్న టాప్ 50 నగరాలలో భారతదేశానికి చెందిన నగరాలు ఉండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+