ఆమ్ ఆద్మీ వీడియో: ముగ్గురు పోలీసుల సస్పెన్షన్
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసులపై తమ పోరాటాన్ని కొనసాగిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారంనాడు ఢిల్లీ పోలీసుల కిరాకత చర్యకు సంబంధించిన వీడియోను పోస్టు చేసింది. ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా రైల్ భవన్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ధర్నా తర్వాత ఆ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ బయటపెట్టింది.
ఎర్రకోట వద్ద ఓ వ్యక్తిని పోలీసులు కొడుతున్న దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించారు. ఢిల్లీ పోలీసులు దుర్మార్గానికి పెట్టింది పేరని, వారి దురాగతాలకు సంబంధించి కథలు వింటూనే ఉంటామని, అటువంటి వీడియో ఇది అని ఆమ్ ఆద్మీ పార్టీ తన సందేశంలో వ్యాఖ్యానించింది.

ఈ వీడియోలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన దృశ్యమే కాకుండా డబ్బులు గుంజుతున్న దృశ్యం కూడా ఉందని ఆ పార్టీ చెప్పింది. వీడియోలో కనిపించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు. వారిపై విచారణకు కూడా ఆదేశించారు. ఇటువంటి సంఘటనలను సహించేది లేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ అన్నారు .
మూడు కేసులకు సంబంధించి ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఇద్దరు పోలీసులను సెలవుపై పంపించడంతో ఆయన ధర్నాను విరమించారు.












Click it and Unblock the Notifications