ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్... ముగ్గురు మావోలు హతం
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మరోసారి తుపాకుల మోత మోగింది.భద్రతాదళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోలు హతమయ్యారు.
గట్టపాడ్-టోకన్‌పల్లి గ్రామాల మధ్య ఉన్న అటవీప్రాంతంలో ఉదయం 10 గంటల సమయంలో ఎన్‌కౌంటర్ జరిగిందని సుకుమా జిల్లా ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు, స్పెషల్ టాస్క్ ఫోర్సులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయని ఎస్పీ వివరించారు. అదే సమయంలో మావోలు కాల్పులకు దిగడంతో భద్రతాబలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగాయని చెప్పారు. ఇందులో ముగ్గురు మావోలు మృతి చెందారని మరి కొంతమంది అడవిలోకి పారిపోయారని చెప్పారు.

ఘటనా స్థలం నుంచి 315 బోర్ రైఫిల్, ఒక పిస్టోలు, మజల్ లోడింగ్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన మావోయిస్టులను గుర్తు పట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications