భారీ వర్షాలు, కుప్పకూలిన ఇంటిపై కప్పు, ఒకే కుటుంబంలో ముగ్గురి దుర్మరణం !
కర్ణాటకలో నాలుగు రోజులుగా భారీ వర్షాలుకుప్పకూలిన ఇంటి పై కప్పు, ఒకే ఇంటిలో ముగ్గురి దుర్మరణంఎమ్మెల్యేలు సొంత ప్రాంతాలకు వెళ్లాలని సీఎం సిద్దరామయ్య మనవి
బెంగళూరు: ఇంటి పై కప్పు కుప్పకూలిపోవడంతో ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన కర్ణాటకలోని గదగ్ జిల్లా గజేంద్ర గడ ప్రాంతంలో జరిగింది. గజేంద్ర గడ ప్రాంతంలో నివాసం ఉంటున్న మాబుబీ ముచ్చాలి (50), ఆమె మనమడు నాజామీన్ (8), మరో మనమడు ముస్కాన్ (6) మరణించారు.
గత నాలుగు రోజుల నుంచి కర్ణాటకలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా మాబుబీ ముచ్చాలి ఇల్లు తడిచిపోయింది. ఇంటి పై కప్పు పాడవడంతో సోమవారం ఒక్క సారిగా అది కుప్పకూలిపోయింది. ఇంటిలో ఉన్న మాబుబీ ముచ్చాలి, నాజమీన్, ముస్కాన్ మరణించారని పోలీసులు అన్నారు.

మిగిలిన కుటుంబ సభ్యులు పనిపై బయటకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారని పోలీసులు చెప్పారు. కర్ణాటకలోని అనేక జిల్లాల్లో 18 సెం.మీ. వర్షాపాతం నమోదు అయ్యింది. కర్ణాటకలోని అన్ని జిల్లాల్లోని శాసన సభ్యులు వారివారి సొంత నియోజక వర్గాలకు వెళ్లి ఇలాంటి సంఘటనలు ఎదురుకాకుండా చూడాలని సీఎం సిద్దరామయ్య సోమవారం మనవి చేశారు. అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుని వర్షాల దెబ్బకు ప్రజల ప్రాణాలు కోల్పోకుండా చూడాలని సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications