మూడేళ్ళబాలిక మూడు గంటలు శిథిలాలకిందే..క్షేమంగా
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో భవనం కూలిన ఘటనలో మూడేళ్ళ బాలిక సురక్షితంగా బయటపడింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాన్పూర్:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో భవనం కూలిన ఘటనలో మూడేళ్ళ బాలిక సురక్షితంగా బయటపడింది.బాలికను ఆమె కుటుంబసభ్యులకు అందించారు.ఈ ప్రమాదం నుండి పాప సురక్షితంగా బయటపడడంతో కుటుంబసభ్యులు ఉబ్బితబ్బియ్యారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో బుదవారం నాడు అపార్ట్ మెంట్ కుప్పకూలింది .ఏడంతస్థుల అపార్ట్ మెంట్ కూలిన ఘటనలో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ భవనం కూలిన ఘటనలో చిక్కుకొన్న వారిని రక్షించేందుకు సహయక చర్యలను ప్రభుత్వం చేపట్టింది.అయితే సహయక చర్యలు చేపట్టిన బృందం మూడేళ్ళ చిన్నారిని సురక్షితంగా రక్షించారు.

మూడేళ్ళ చిన్నారి కోసం తల్లిదండ్రులు తల్లడిల్లారు.అయితే శిథిలాల కింద చిన్నారి క్షేమంగా ఉంది. ఈ చిన్నారిని గుర్తించిన సిబ్బంది తల్లిదండ్రులకు అప్పగించారు.
ప్రాణాపాయం నుండి తప్పించుకొన్న ఆ చిన్నారిని చూసిన ఆ కుటుంబసభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు.ప్రాణాలతో తమ కూతురు బయటపడిందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications