టైగర్ ష్రాఫ్ పై కాల్పులు ఘటనలో కీలక విషయాలను వెల్లడించిన పోలీసులు..
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ముంబై పోలీసులు.. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు నేపాల్ పారిపోతున్న క్రమంలో రాజస్థాన్ లోని కోటాలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితులంతా మేజర్లేనని పోలీసులు స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో హరియాణాకు చెందిన ఫుల్ సింగ్ నరేశ్, రెహాన్ రషీద్దీన్ అలాగే ముంబైలో నివసిస్తున్న హృతిక్ అనే రాపిడో డ్రైవర్ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాల్పుల సమయంలో హృతిక్ బైక్ డ్రైవింగ్ చేస్తుండగా.. మిగిలిన ఇద్దరు కాల్పులు జరిపినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు సెప్టెంబర్ 11 న ఈ గ్యాంగ్ ఓ మోటార్ సైకిల్ ను కొనుగోలు చేసినట్లు విచారణలో స్పష్టమైంది.
ఇక టైగర్ ష్రాఫ్ పై దాడికి దాదాపు 20 రోజుల ముందే నిందితులు ముంబైకు చేరుకుని పక్కా ప్రణాళికతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. టైగర్ ష్రాఫ్ నిత్యం ఆటకు వెళ్లే ఫుట్ బాల్ మైదానం వద్దకు వెళ్లి దుండగులు వారం రోజుల ముందు నుంచే రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇక కాల్పుల తర్వాత నిందితులు ముందుగా బైక్ పై అంధేరీ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి లోకల్ ట్రైన్ లో కాందివలీకి వెళ్లారు. ఇక అక్కడినుంచి క్యాబ్ బుక్ చేసుకుని సూరత్ కు జంప్ అయ్యారు. అక్కడే పక్కా సమాచారంలో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు దిల్లీ చేరుకుని ఆ తర్వాత అక్కడి నుంచి నేపాల్ పారిపోవాలని ప్లాన్ వేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో స్పష్టమైంది.

ఇక నిందితుల్లో ఒకరైన రెహాన్ అనే వ్యక్తికి లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనూ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఇక దుండగుల నుంచి ఓ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకోగా.. కాల్పులకు ఉపయోగించిన ఆయుధం ఇంకా గుర్తించాల్సి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
