జైల్లోనే స్పాట్... పక్కా ప్లాన్‌తో... తీహార్‌లో ప్రకంపనలు రేపిన హత్య...
తీహార్ జైల్లో చోటు చేసుకున్న ఓ హత్య పెను ప్రకంకపనలు సృష్టించింది. ఓ హత్య కేసులో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ.. తన తోటి ఖైదీని తీవ్రంగా పొడిచి చంపాడు. పాత కక్షల నేపథ్యంలో పక్కా ప్లాన్‌తోనే ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చాలా ఏళ్లుగా అతన్ని హత్య చేసేందుకు నిందితుడు అదును కోసం ఎదురుచూస్తున్నట్టుగా గుర్తించారు. చివరకు హత్య కేసులో జైలుకు వచ్చే అక్కడే అతనికి స్పాట్ పెట్టాడు.

అసలేం జరిగింది...
సోమవారం(జూన్ 29) తీహార్ జైల్లోని వార్డు నంబర్.4లో జకీర్(21) అనే ఖైదీ మహమ్మద్ మెహ్తాబ్(27) అనే తోటి ఖైదీని దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఉదయం పూట అందరూ ప్రేయర్‌కి వెళ్లిన సమయంలో... జకీర్ మెహ్తాబ్‌పై పదునైన వస్తువుతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో మెహ్తాబ్ అక్కడికక్కడే మృతి చెందాడు. జకీర్‌పై సెక్షన్ 302 కింద హరినగర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జకీర్ సోదరిపై మెహ్తాబ్ అత్యాచారం...
చాలా ఏళ్లుగా జకీర్ మెహ్తాబ్‌ను హత్య చేయాలనే కక్షతో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. జకీర్ సోదరిపై మెహ్తాబ్ అత్యాచారానికి పాల్పడ్డట్టు గుర్తించారు. అదే కేసులో ప్రస్తుతం అతను తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతనిపై సెక్షన్ 376D,328,363,342,120Bలతో పాటు పోక్సో చట్టం కింద ఢిల్లీలోని అంబేడ్కర్ నగర్‌లో కేసులు నమోదయ్యాయి. మెహ్తాబ్ జకీర్ సోదరిపై అత్యాచారం చేసిన తర్వాత.. అవమాన భారంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటినుంచి జకీర్ మెహ్తాబ్‌పై పగతో రగిలిపోతున్నాడు.

పక్కా ప్లాన్ ప్రకారమే...
నిజానికి జకీర్ తీహార్ జైల్లో సెల్ నం.8లో ఖైదీగా ఉన్నాడు. అయితే ఇటీవల తోటి ఖైదీలతో గొడవల కారణంగా... తనను గ్రౌండ్ ఫ్లోర్‌లోని వార్డు నంబర్.4కి మార్చమని అధికారులకు విజ్ఞప్తి చేశాడు. అదే సెల్‌లో మెహ్తాబ్ శిక్ష అనుభవిస్తుండటంతో... అక్కడైతే తన పని సులువవుతుందని జకీర్ భావించాడు. కానీ అసలు విషయం తెలియని అధికారులు అతన్ని సెల్ నం.8 నుంచి వార్డు నంబర్.4లోకి మార్చారు.
Recommended Video

ఆ ఉదయం హత్య...
వార్డు నంబర్.4లోకి వెళ్లాక... జకీర్ రెండు,మూడు రోజులు మెహ్తాబ్ దినచర్యను గమనించాడు. ఉదయం పూట అయితేనే హత్యకు అనువుగా ఉంటుందని భావించాడు. జూన్ 29 ఉదయం ఖైదీలందరినీ జైలు అధికారులు ప్రేయర్ కోసం పిలిచారు. ఆ సమయంలో మెహ్తాబ్ కూడా వెళ్లేందుకు సిద్దమవుతుండగా... జకీర్ అతనిపై పదునైన వస్తువుతో దాడి చేశాడు. మెడ,పొట్ట,ఇతర భాగాల్లో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో మెహ్తాబ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఘటనపై విచారణ జరుపుతున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపక్ పురోహిత్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications