ఆండ్రాయిడ్, యాపిల్ ప్లే స్టోర్ ల నుండి టిక్‌టాక్ తొలగింపు.... ఆ నిషేధిత యాప్స్ కూడా

భారత్ చైనా సరిహద్దు ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతల నేపధ్యంలో జాతీయ భద్రత మరియు గోప్యతా సమస్యలపై దృష్టి సారించిన ఇండియా టిక్ టాక్ తో సహా 59 చైనా మొబైల్ యాప్స్ నిషేధించింది. చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్ పై నిషేధం విధించాల‌ని లేదా ప్ర‌జ‌లు వాటిని వాడ‌కుండా చూడాల‌ని నిఘా వర్గాలు బుధ‌వారం కేంద్రానికి సిఫార‌సు చేసిన నేపధ్యంలోనే ఈ యాప్స్ పై నిషేధం విధించినట్టుగా తెలుస్తుంది.

భద్రతా సమస్యల దృష్ట్యా చైనీస్ యాప్స్ పై నిషేధం విధించిన కేంద్రం

భద్రతా సమస్యల దృష్ట్యా చైనీస్ యాప్స్ పై నిషేధం విధించిన కేంద్రం

దేశం మొత్తం బ్యాన్ చైనా యాప్స్ ,బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్ అంటూ ఉద్యమం కొనసాగుతున్న వేల ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 59 చైనా యాప్స్ పై వేటు పడింది .

వీటి వ‌ల్ల దేశ భ‌ద్ర‌త‌కే ముప్పు ఉంద‌ని హెచ్చ‌రికలు జారీ చేయడంతో నిఘావర్గాల సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వ వాటిని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. చైనాతో లింక్ ఉన్న యాప్ లేదా సాఫ్ట్‌వేర్‌లను ఉప‌యోగించ‌డం ద్వారా డేటా చోరీకి గురయ్యే అవ‌కాశం ఉంద‌ని నిఘా విభాగం అధికారులు వెల్లడించారు. దీంతో దేశ భద్రత ముఖ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం .

 గూగుల్‌, యాపిల్‌ సంస్థలకు యాప్స్ తొలగింపు ఆదేశాలు .. 59 యాప్స్ డిలీట్

గూగుల్‌, యాపిల్‌ సంస్థలకు యాప్స్ తొలగింపు ఆదేశాలు .. 59 యాప్స్ డిలీట్

టిక్‌టాక్, యూసీ బ్రౌజ‌ర్, జెండ‌ర్, షేర్ఇట్, క్లీన్ మాస్ట‌ర్ స‌హా 59 ఇత‌ర మొబైల్ అప్లికేష‌న్ల ద్వారా డేటా త‌స్కర‌ణ‌కు గుర‌వుతుంద‌ని నివేదిక‌లు అందడంతో వారిని నిన్న నిషేధించారు. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో అధికారులు గూగుల్‌, యాపిల్‌ సంస్థలకు నిన్ననే ఉత్తర్వులను పంపగా భారత్‌లో గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌ల నుంచి ఆ 59 యాప్ లను ఆయా స్టోర్స్ నుండి తొలగించారు.

ఆండ్రాయిడ్ యొక్క ప్లే స్టోర్ , ఆపిల్ స్టోర్ నుండి టిక్‌టాక్ తొలగింపు

ఆండ్రాయిడ్ యొక్క ప్లే స్టోర్ , ఆపిల్ స్టోర్ నుండి టిక్‌టాక్ తొలగింపు

ముఖ్యంగా ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్ ఆండ్రాయిడ్ యొక్క ప్లే స్టోర్ మరియు ఆపిల్ స్టోర్ నుండి తొలగించబడింది. జనాదరణ పొందిన చైనీస్ యాప్ భారతదేశంలోనే 120 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులను కలిగి ఉంది, ఇక దీనిని వినియోగించే వారు ఎక్కువగా 20 ఏళ్ళలో ఉన్నవారు. నిన్న రాత్రి వరకు అవి స్టోర్స్ లో కనపడగా, నేటి ఉదయం నుంచి అవి తొలగించబడ్డాయి .

టిక్ టాక్ కు ఇండియా అతి పెద్ద మార్కెట్ .. స్టాటిస్టిక్స్ ఇవే

టిక్ టాక్ కు ఇండియా అతి పెద్ద మార్కెట్ .. స్టాటిస్టిక్స్ ఇవే

టిక్ టాక్ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే 100 బిలియన్ డాలర్ల గ్లోబల్ రెవెన్యూ అన్న టిక్ టాక్ కు 3 బిలియన్ డాలర్ల గ్లోబల్ ప్రాఫిట్ ఉంది. రెండు బిలియన్ ల డౌన్ లోడ్స్ టిక్ టాక్ యాప్ కు ఉన్నాయి. 2019 సంవత్సరంలో 400 మిలియన్ల ఇండియన్స్ టిక్ టాక్ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తంగా ఇండియాలో 611 మిలియన్ల టిక్ టాక్ యూజర్స్ ఉన్నారు. 2019 సంవత్సరంలో 5.5 బిలియన్ల గంటల సమయాన్ని ఇండియన్స్ టిక్ టాక్ మీద గడిపారు. ప్రపంచంలోనే టిక్ టాక్ కు ఇండియా అతి పెద్ద మార్కెట్.

Recommended Video

    Netflix India Upgrading HD Quality Video for Mobile And Basic Plans
     ఐటీ చట్టం-2000లోని సెక్షన్‌ 69ఏ కింద యాప్స్‌ నిషేధం .. తొలగింపు సమాప్తం

    ఐటీ చట్టం-2000లోని సెక్షన్‌ 69ఏ కింద యాప్స్‌ నిషేధం .. తొలగింపు సమాప్తం

    భారత దేశ భద్రత, రక్షణ శాఖ రహస్యాలు వంటి వాటికి భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో ఐటీ చట్టం-2000లోని సెక్షన్‌ 69ఏ కింద ఈ యాప్స్‌ను నిషేధించారు. టిక్ టాక్ బ్యాన్ చేయడం వల్ల దాని ప్రభావం చైనాపై కచ్చితంగా పడుతుంది అనడం నిస్సందేహం. అయితే చైనా పైన ఎంత ప్రభావం పడుతుందో టిక్ టాక్ అనే యాప్ వ్యసనంగా మారిన ఇండియన్స్ పై కూడా అంతే ప్రభావం పడుతుంది అనడం గమనించాల్సిన అంశం. ఇక ఈ సమయంలో ప్రభుత్వ నిర్ణయం , ప్రభుత్వ నిర్ణయాన్ని యాప్స్ తొలగిస్తూ వెంటనే అమలు చెయ్యటం కూడా జరిగిపోయాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+