Timesnow JVC Exit Poll: మరాఠా కింగ్ ఎవరో తేల్చేసిన టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్..!
మహారాష్ట్రలో ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ మరో సర్వే సంస్థ జేవీసీతో కలిసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి మరోసారి భారీ మెజార్టీతో అధికారం చేపడుతుందని అంచనా వేసింది. విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమికి ఈసారి విపక్షానికి పరిమితం కావడం ఖాయమని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ తేల్చేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉండగా..ఇందులో ఈసారి బీజేపీ, శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో కూడిన మహాయుతి కూటమి ఏకంగా 150 నుంచి 167 సీట్లు సాధిస్తుందని టైమ్స్ నౌ జేవీసీ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అటు కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గంతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమికి కేవలం 107 నుంచి 125 సీట్లు మాత్రమే వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.

మహారాష్ట్ర అసెంబ్లీకి ఈసారి జరిగిన ఎన్నికల్లో హోరీహోరీ పోరు సాగినట్లు తెలుస్తోంది. అయితే అధికార మహాయుతి కూటమి ఈ పోరులో విజేతగా నిలవబోతున్నట్లు టైమ్స్ నౌ సహా పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మహా వికాస్ అఘాడీతో హోరాహోరీ పోరు సాగినా అంతిమంగా మెజార్టీ సీట్లలో మహాయుతికే ఆధిక్యం దక్కినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపులో మహారాష్ట్రలో అసలు విజేత ఎవరో తేలిపోనుంది.












Click it and Unblock the Notifications