జయ పార్టీలో విషాదం: కొద్ది గంటల్లో ప్రమాణం చేయాల్సిన ఎమ్మెల్యే మృతి
చెన్నై: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడు దశాబ్దాల తర్వాత వరుసగా రెండో పర్యాయం అధికారం నిలబెట్టుకున్న అన్నాడీఎంకే పార్టీలో విషాదం నెలకొంది. రెండ్రోజుల క్రితమే ఆ పార్టీ అధినేత్రి జయలలిత అట్టహాసంగా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.
కాగా, తిరుప్పరంకుంద్రం నుంచి కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివేల్ (65) గుండెపోటుతో చనిపోయారు. తిరుప్పరంగుండ్రం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలగా ఎన్నికైన శ్రీనివేల్ గతవారం గుండెనొప్పితో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.

చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. 15 అసెంబ్లీ సమావేశాల్లో కొద్ది గంటల్లో ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేయల్సిన పార్టీ ఎమ్మెల్యే మరణంతో అన్నాడీఎంకేలో విషాధ ఛాయలు అలముకున్నాయి.
ఐదేళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఎన్నికల అనంతరం అసెంబ్లీ మొదటి మావేశం జరుగుతున్న క్రమంలో పశ్చిమ త్రిచీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన మరియం పిచాయ్ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాణం స్వీకారం చేసేందుకు చెన్నై వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications