వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలకే మమత అగ్రతాంబులం .. 41 శాతం టికెట్లు కేటాయించిన దీదీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Elections 2019 : Mamata Banerjee Announced The Candidates Contesting For The TMSC

కోల్ కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏం చేసినా సంచలనమే. రాజకీయ ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో .. ప్రజలను ఆకర్షించడం ... కేంద్రంపై బహిరంగంగానే విమర్శలు చేసే ధీశాలి మమత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 రాహుల్ క్యాస్ట్ ఇష్యూ : మరి మీ కులమేంటీ ? అనంత్ హెగ్డేకు కాంగ్రెస్ ప్రశ్న.డీఎన్ఏ టెస్ట్ కు సిద్దమా ? రాహుల్ క్యాస్ట్ ఇష్యూ : మరి మీ కులమేంటీ ? అనంత్ హెగ్డేకు కాంగ్రెస్ ప్రశ్న.డీఎన్ఏ టెస్ట్ కు సిద్దమా ?

మహిళా పక్షపాతి ..

మహిళా పక్షపాతి ..

మమతా బెనర్జీ తాను మహిళా పక్షపాతి అని మరోసారి చాటుకున్నారు. ఈ పురుషాధిక్యత సమాజంలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఉండాలని భావించే ఆమె ... వారికే ఎక్కువ సీట్లను కేటాయించారు. నిన్న టీఎంసీ తరఫున పోటీచేసే అభ్యర్థులను ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాలకు గెలుపుగుర్రాల పేర్లను వెల్లడించారు. అయితే వీరిలో 17 సీట్లు మహిళలకు కేటాయించారు. అంటే మొత్తం సీట్లలో 41 శాతం టికెట్లను లేడీ లీడర్లకు ప్రకటించి తాను ఫేమినిస్టునని చాటుకున్నారు మమతా.

కూటమి నేతల విస్మయం

కూటమి నేతల విస్మయం

బెంగాల్ తోపాటు అసోం, జార్ఖండ్, బీహర్, అండమాన్, సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో టీఎంసీ పోటీ చేస్తుందని పేర్కొన్నారు మమతా. అయితే ఆమె మహాకూటమి ఏర్పాట్లలో కీ రోల్ పోషిస్తున్న ఆమె .. 42 సీట్లకు అభ్యర్థులను ప్రకటించడంపై భాగస్వామ్య పక్ష నేతలు ఆశ్చర్యపోయారు.

బీజేడీ 33 ... టీఎంసీ 41

బీజేడీ 33 ... టీఎంసీ 41

మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే అన్ని పార్టీలకు సవాల్ విసిరారు మమత. ఈసారి టీఎంసీ మహిళలకు 41 శాతం సీట్లు కేటాయించిందని పేర్కొన్నారు. మహాకూటమి భాగస్వామ్య పక్ష నేత, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తమ పార్టీ మహిళలకు 33 శాతం టికెట్లు ఇస్తోందని ప్రకటించిన మూడురోజులకు మమత మహిళలకు పెద్దపీట వేయడం గమనార్హంం.

10 మంది సిట్టింగ్ ఎంపీలకు ఝలక్

10 మంది సిట్టింగ్ ఎంపీలకు ఝలక్

దీదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పది మంది సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టారు. సినీతారలకు ప్రాధాన్యం ఇచ్చారు. సుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తికి టికెట్లు కేటాయించారు. అన్ సోల్ నియోజకవర్గంలో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోపై మున్ మున్ సేన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇటీవలే టీఎంసీలో చేరిన మౌసమ్ నూర్ మల్దా, ఇటీవలే హత్యకు గురైన ఎమ్మెల్యే సత్యజిత్ బిస్వాస్ భార్మ రూపాలీ బిస్వాస్ కు రణగత్ నుంచి అవకాశం కల్పించారు.

English summary
Mamata Banerjee announced the candidates contesting for the TMSC. All the 42 seats in the state have been named after the winners. Of these, 17 seats are reserved for women. That is, 41% ticket for all the seats in the ladies was announced by the mamata. Mamata said that the TMC would compete in all six states, including Bengal, Assam, Jharkhand, Bihar and Andaman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X