ఎన్నికల తరువాత కలిసిపోతాం: అందుకే, శశికళకు షాక్ ఇచ్చిన పన్నీర్ !

తమిళనాడును నాశనం చెయ్యడానికి కంకణం కట్టుకున్న శశికళ కుటుంబాన్ని సాగనంపడానికి ప్రయత్నిస్తున్నామని, ఆమె వర్గంలోని ఎమ్మెల్యేలు అందరూ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల తరువాత తన వర్గంలోకి వస్తారని తమిళనాడు మాజీ ముఖ

చెన్నై: శశికళ వర్గంలోని 122 మంది ఎమ్మెల్యేలు అందరూ త్వరలో తన వర్గంలోకి వచ్చేస్తారని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ( పురుచ్చి తలైవి అమ్మ) పార్టీ నాయకుడు పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అాన్నాడీఎంకే పార్టీలో ప్రకంపనలు సృష్టించి బయటకు వచ్చిన నేత పన్నీర్ సెల్వం. అధికారం దూరం అయినా సరే ఇప్పుడు పార్టీని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే లక్షంగా తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల గెలుపుతో పార్టీ వర్గాల దృష్టిని తన వైపు తిప్పుకుని బలాన్ని నిరూపించుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు.

122 మంది వస్తారు అనే ధీమా

122 మంది వస్తారు అనే ధీమా

అసెంబ్లీ వేదికగా బలపరీక్ష ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో అందరికీ తెలిసిందేనని పన్నీర్ సెల్వం అంటున్నారు. ఎమ్మెల్యేలను బలవంతంగా బంధించి, బెదిరించి మద్దతు కూడగట్టుకున్నారని పన్నీర్ సెల్వం ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వంపై మండిపడుతున్న ఎమ్మెల్యేలు

ప్రభుత్వంపై మండిపడుతున్న ఎమ్మెల్యేలు

తమిళనాడులో ప్రస్తుత ప్రభుత్వాన్ని మెజారిటీ శాతం ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని, ఆర్ కే నగర్ ఉప ఎన్నికల తరువాత వారందరూ తన వైపు వస్తారనే నమ్మకం ఉందని పన్నీర్ సెల్వ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒకే వేదికగా పుంజుకుంటాం

ఒకే వేదికగా పుంజుకుంటాం

అన్నాడీఎంకే నాయకులు అందరూ ఒకే వేదికగా మళ్లీ పుంజుకుంటామని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తాత్కాలికమే అని, ఎప్పుడు ఊడిపోతుందో తెలీదని పన్నీర్ సెల్వం అన్నారు. మొత్తం మీద ఆర్ కే నగర్ ఉప ఎన్నికల తరువాత పరిస్థితులు వేరుగా ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇది పార్టీనా, ఫ్యామిలీ ప్యాకేజా ?

ఇది పార్టీనా, ఫ్యామిలీ ప్యాకేజా ?

అన్నాడీఎంకే పార్టీని నాశనం చెయ్యాలని శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కంకణం కట్టుకున్నారని పన్నీర్ సెల్వం మండిపడ్డారు. శశికళ కుటుంబ సభ్యుల జోక్యంతోనే అన్నాడీఎంకే పార్టీ చీలిక అనివార్యం అయ్యిందని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు.

ఎంజీఆర్, జయలలితకు ఇష్టం లేదు

ఎంజీఆర్, జయలలితకు ఇష్టం లేదు

దివంగత ముఖ్యమంత్రి ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్) ఎన్నడూ అన్నాడీఎంకే పార్టీలో తన కుటుంబీకుల జోక్యానికి అనుమతి ఇవ్వలేదని పన్నీర్ సెల్వం గుర్తు చేశారు. అమ్మ జయలలిత కూడా ఎంజీఆర్ తరహాలోనే పార్టీని ముందుకు నడిపించారని చెప్పారు.

అమ్మ లేరనే ధైర్యంతోనే ఇలా చేస్తున్నారు

అమ్మ లేరనే ధైర్యంతోనే ఇలా చేస్తున్నారు

అమ్మ జయలలిత మరణించారనే ధైర్యంతోనే శశికళ కుటుంబం ఇష్టారాజ్యంగా వ్యవహిరిస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేందుకు సిద్దమైందని పన్నీర్ సెల్వం విరుచుకుపడ్డారు.

శశికళ అండ్ కో ను సాగనంపి

శశికళ అండ్ కో ను సాగనంపి

శశికళ కుటుంబం జోక్యం చేసుకోకుండా ఉండి ఉంటే అందరం ఒకే వేదికగా కలిసి ఉండే వాళ్లమని, ఇప్పుడు ఆ కుటుంబాన్ని సాగనంపి మళ్లీ అందరూ ఒకే వేదికగా ముందుకు సాగే సమయం తప్పకుండా వస్తోందని, అందకు ప్రజల మద్దతు అవసరం అని, రెండాకుల చిహ్నాన్ని చీలిపోకుండా మళ్లీ పాధిస్తామనే నమ్మకం ఉందని పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+