రూ.500 కోట్లు: సీఎం పన్నీరు, చెన్నైవాసుల్ని భయాందోళన కలిగిస్తున్న సందేశం
వార్ధా తుపాను తమిళనాడు రాజధాని చెన్నైలో తీవ్ర నష్టం కలిగించింది. చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు తదితర జిల్లాల్లో భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది.
చెన్నై: వార్ధా తుపాను తమిళనాడు రాజధాని చెన్నైలో తీవ్ర నష్టం కలిగించింది. చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు తదితర జిల్లాల్లో భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. దీంతో పునారావాస చర్యల నిమిత్తం తమిళనాడు ప్రభుత్వం రూ.500కోట్లు కేటాయించింది.\
రూ.500 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పారు. ఇందులో భాగంగా రూ.350 కోట్లును తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్‌కు, రూ.75 కోట్లు చెన్నై కార్పోరేషన్‌కు, రూ.25 కోట్లు జాతీయరహదారుల విభాగానికి కేటాయించారు.

సోషల్ మీడియాలో చెన్నై వాసులను భయాందోళనకు గురి చేస్తున్న సందేశం
వార్దా తుపాను చెన్నైని తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఓ సందేశం రౌండ్లు కొడుతోంది. ఇది చెన్నై వాసులకు మరింత ఆందోళన కలిగిస్తోంది. వారిని భయకంపితులకు గురి చేస్తోంది.
చెన్నైలో ఉండే స్నేహితులను, బంధువులను త్వరగా వదిలిపొమ్మని సలహా ఇస్తూ సందేశం ఉంది. రాగల 72 గంటల్లో తుపాను మరింత తీవ్రమౌతుందనే సందేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. చెన్నైలో 250 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావొచ్చని, చెన్నై మొత్తం మునిగిపోవచ్చని నాసా హెచ్చరించినట్లుగా సందేశంలో ఉంది.
విప్రోలాంటి సంస్థలు కూడా తమ సిబ్బందిని చెన్నై నుంచి తరలించడానికి వందలాది బస్సులు ఏర్పాటు చేసుకుంటోందని సందేశంలో ప్రస్తావించారు. ఈ సందేశంలో తుపాను పేరును మాత్రం ఎల్నినో అని ప్రస్తావించారు. వాస్తవానికి ఎల్నినో తుపాను గత ఏడాది వచ్చింది.
గత ఏడాది ఇలాంటి సందేశాన్నే పెట్టి చెన్నైవాసులను కొందరు సోషల్ మీడియా ద్వారా భయపెట్టారు. మళ్లీ ఇప్పుడు వార్దా సమయంలోనూ పాత సందేశాన్నే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చెన్నై వాసులను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు సందేశాలను ప్రజలు నమ్మవద్దని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రచారాలపై చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications