శశికళకు దెబ్బ మీద దెబ్బ: మాజీ సీఎస్ సస్పెన్షన్ రద్దు చేసిన పన్నీర్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం శశికళకు షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది. తాజాగా కొంత కాలం క్రితం సస్పెండ్ కు గురైన తమిళనాడు మాజీ సీఎస్ జ్ఞాన్ దేశికన్, అడిషనల్ సీఎస్ అతుల్ ఆనంద్ ల సస్పెన్షన్ రద్దు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది.
పలు ఆరోపణలు రావడంతో గతంలో జయలలిత సీఎంగా ఉన్న సమయంలో మాజీ సీఎస్ జ్ఞాన్ దేశికన్, అడిషనల్ సీఎస్ అతుల్ ఆనంద్ లను సస్పెండ్ చేశారు. తరువాత జయలలిత మరణించడం, ముఖ్యమంత్రి అయిన పన్నీర్ సెల్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఇద్దరు అధికారుల సస్పెండ్ విషయం మరుగనపడింది.

అయితే అన్నాడీఎంకే చీఫ్ శశికళ మీద అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఇద్దరు అధికారులు అంటే శశికళకు, మన్నార్ గుడి గ్యాంగ్ కు గిట్టదనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ సందర్బంలో తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మాజీ సీఎస్ జ్ఞాన్ దేశికన్, అడిషనల్ సీఎస్ అతుల్ ఆనంద్ ల సస్పెన్షన్ రద్దు చేశారు. అనంతరం తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ దెబ్బతో శశికళకు పన్నీర్ సెల్వం ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications