వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావేరి: సరిహద్దులు బంద్, అందరి కన్ను ఢిల్లీ పైనే

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కావేరీ జలాల వివాదంపై తమిళనాడు తీరుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 19 సోమవారం కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని అత్తిబెల్ చెక్ పోస్టు దగ్గర బంద్ కు పిలుపునిచ్చారు. వాటళ్ పార్టీ అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యుడు వాటళ్ నాగరాజ్ బంద్ కు నేతృత్వం వహించారు.

కర్ణాటక-తమిళనాడు మధ్య వాహన సంచారాన్ని అడ్డుకుంటామని ఆయన పిలుపునివ్వడంతో పోలీసులు గట్టిబందో బస్తు ఏర్పాటు చేశారు. ఆందోళన సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరకుండా కర్ణాటక, తమిళనాడు పోలీసులు మొహరించారు.

వాటళ్ నాగరాజ్ మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కావేరీ జలాల వివాదం అడ్డంపెట్టుకుని కుళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలోని బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులకు రైతు కష్టాల గురించి పట్టించుకునే తీరకలేదని ఎద్దేవ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ లేఖ రాసిందని, అయతే ప్రధాని ఎందుకు జోక్యం చేసుకుంటారు అని బీజేపీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. తాగు నీటి సమస్య ఎదురౌతుందని ఈ రాజకీయ నాయకులకు ముందుచూపు లేదని మండిపడ్డారు.

 Vattal Nagaraj

అయితే కావేరీ మానటరింగ్ కమిటి ఢిల్లీలో సమావేశం కానున్న సందర్బంగా కర్ణాటకకు వ్యతిరేకంగా తీర్పు వస్తే గొడవలు జరుగుతాయనే అనుమానంతో ముందు జాగ్రత్తగా మండ్య జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

అందరి కన్ను ఢిల్లీ మీదే

సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర జనవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి శశిశేఖర్ అధ్యక్షతన కావేరీ జలాల పంపిణి విషయంలో వాదన జరగనుంది. కర్ణాటక ముఖ్య కార్యదర్శి అరవింద్ జాధవ్ తో పాటు తమిళనాడు, పుదుచ్చేరీ, కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలు ఈ సమావేశంలో పాల్గోంటారు.

కావేరి మానటరింగ్ కమిటీ ముందు వారివారి వాదనలు వినిపించనున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు తమిళనాడుకు నీళ్లు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకు నీళ్లు విడుదల చేస్తున్నారు.

ఈ కేసు విచారణ సెప్టెంబర్ 20వ తేదిన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అయితే సోమవారం కావేరి మానటరింగ్ కమిటి ముందు జరిగే చర్చలో తీర్పు ఏ రాష్ట్రానికి అనుకూలంగా వస్తుందని అని అందరు టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.

English summary
All eyes would be on the meeting of the Cauvery Supervisory Committee which is scheduled to meet in New Delhi today. Karnataka and Tamil Nadu would both make out a case before the Committee today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X