Today in Parliament: నో డిబేట్స్: సాగు చట్టాల ఉపసంహరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం: రచ్చ రచ్చ
న్యూఢిల్లీ: ఊహించినట్టే- అత్యంత వివాదాస్పదంగా మారిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లును కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి సర్కార్.. లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఆ వెంటనే- ఈ బిల్లు సభ ఆమోదం పొందినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించారు. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లు సభ ఆమోదం పొందడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆ మూడు బిల్లులు ఇవే..
ఈ మధ్యాహ్నం 12 గంటలకు సభ పునః ప్రారంభమైన తరువాత కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్- ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లును పేరును ఆయన చదివి వినిపించారు. దీన్ని సభ ఆమోదం కోసం ప్రవేశపెట్టినట్టు చెప్పారు. దీన్ని ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) యాక్ట్ 2020, ఎసెన్షియల్ కమోడిటీస్ (అమెండ్‌మెంట్) యాక్ట్ 2020, ఫార్మర్స్ (ఎంపవర్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ 2020ని వెనక్కి తీసుకోనున్నట్లు తెలిపారు.

సభ ఆమోదం పొందినట్టుగా..
ఆ వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. ఈ మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించిన బిల్లు సభ ఆమోదం పొందినట్లు ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఎలాంటి డిబేట్స్ లేకుండా ఓ బిల్లును లోక్‌సభ ఎలా ఆమోదిస్తుందని ప్రశ్నించారు. దీనిపై చర్చను చేపట్టాల్సిందేనంటూ పట్టుబట్టారు. సభను సజావుగా సాగనివ్వడానికి అధికార పక్షం చొరవ చూపించాలని సూచించారు.

ఉద్దేశపూరకంగా గందరగోళం..
ఉద్దేశపూరకంగానే అధికార పక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే సభ్యులు మద్దతుగా నిలిచారు. ఆయనతో గొంతు కలిపారు. మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ బిల్లుపై చర్చ సాగకూడదనే కారణంతో అధికార పార్టీ సభ్యులు అనవసరంగా సభలో గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. చర్చ చేపట్టేంత వరకూ ఈ బిల్లు సభ ఆమోదం పొందనట్టుగానే భావించాలని డిమాండ్ చేశారు.

తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం..
దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకరినొకరు విమర్శించుకున్నారు. పరస్పర ఆరోపణాస్త్రాలను సంధించుకున్నారు. సభను సజావుగా నడిపించడానికి స్పీకర్ ఓం బిర్లా చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీనితో ఆయన సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకుే సభను వాయిదా వేశారు. సభ మళ్లీ పునఃప్రారంభమైన తరువాత కూడా ఇదే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు.

స్వాగతించిన తికాయత్..
కాగా- మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించిన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడాన్ని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్ స్వాగతించారు. తాము దీన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని కౌశంబిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 750 మంది రైతుల ప్రాణత్యాగం తరువాత కేంద్ర ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను గ్రహించిందని పేర్కొన్నారు. తమ ఇతర డిమాండ్లను నెరవేర్చేంత వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications