వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమారుని మరణ వార్తను ఏప్రిల్ పూల్ జోక్ అనుకున్న తల్లిదండ్రులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కాన్పూర్: కుమారుని మరణవార్తను తమను ఏప్రిల్ పూల్స్ చేయడానికి వచ్చిన వార్తగా భావించి తల్లిదండ్రులు పట్టించుకొని ఘటన కాన్పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే,
ఉత్తరప్రదేశ్‌లోని జలాన్ జిల్లాలోని కాన్పూర్‌లో గల గోవింద్ పూరి రైల్వే స్టేషన్ సమీపంలో అంకిత్ (24) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ ఆత్మహత్య సంఘటన ఏప్రిల్ 1వ తేదీన జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ప్రమాదస్ధలిని పరిశీలించి యువకుడి మృతిపై వివరాలు సేకరించి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. మమ్మల్ని పూల్స్‌ని చేయడానికే ఇలా చెబుతున్నారని వారు పట్టించుకోలేదు.

Told That Son Killed Himself, Parents Felt It Was April Fool's Prank

రెండోసారి ఫోన్ చేసినా కూడా వారు పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. దీంతో నాలుగు గంటలపాటు తల్లిదండ్రుల కోసం వేచి చూసి ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. అంకిత్ చనిపోయిన విషయాన్ని తల్లిందండ్రులకు తెలిపేందుకు ఓ కానిస్టేబుల్‌ను మృతుడి ఇంటికి పంపించారు.

అయితే అంకిత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోస్ట్‌ మార్టం అనంతరం శరీరాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

English summary
A 24-year-old man allegedly committed suicide by jumping in front of a train, but when police informed about the incident to his parents, they dismissed it twice as an April Fool prank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X