Tomato:పచ్చని కాపురాన్ని కూల్చిన ఎర్రటి టమాటా..డీటెయిల్స్ ఇన్‌సైడ్..!
మధ్యప్రదేశ్ : టమాటా..ఈ మాట వింటేనే ధడ పుడుతోంది. అంతలా దీని ధరలు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా మార్కెట్లో టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇప్పట్లో దిగేది లేదంటూ తెగేసి చెప్పేస్తున్నాయి. టమాటాలు కొనాలంటే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. చాలామంది తమ వంటల్లో లేదా కూరల్లో టమాటాకు గుడ్ బై చెప్పేశారు. లేదా చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నారు. ఓ వైపు జేబులకు చిల్లు పెడుతూనే మరోవైపు పచ్చని కాపురాల్లో ఎర్రటి టమాటా చిచ్చు కూడా పెడుతోంది.
తాజాగా మధ్యప్రదేశ్‌లో ఎర్రటి టమాటా కారణంగా పచ్చని కాపురం చెల్లా చెదురైంది. ఎంతో అన్యూన్యంగా జీవిస్తున్న భార్యాభర్తల మధ్య ఈ టమాటా చిచ్చు పెట్టింది. ఇక వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లా బేమ్‌హారి గ్రామంలో సంజీవ్ కుమార్ వర్మ అతని భార్య బిడ్డతో నివసిస్తున్నాడు. ఒక టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పచ్చటి సంసారం టమాటా ప్రకంపనలు సృష్టించింది.

టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న సంజీవ్ కుమార్.. ఎప్పటిలాగే పూరీలోకి వెజిటెబుల్ సబ్జా తయారు చేసేందుకు సిద్దమయ్యాడు. అయితే మంచి రుచి కోసం భార్యకు తెలియకుండా అదనంగా రెండు టమాటాలు ఆ కర్రీలో వేశాడు. ఇదే ఆయన చేసిన పొరపాటు. విషయం తెలుసుకున్న సంజీవ్ భార్యకు కోపం నషాలానికంటింది. ఇంకేముంది భర్తతో గొడవకు దిగింది.
వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సంజీవ్ భార్య కూతురును తీసుకుని ఇళ్లు విడిచి ఎటో వెళ్లిపోయింది. భార్యా బిడ్డ కోసం వెతికి వెతికి అలసిపోయిన సంజీవ్ చివరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తాను చేసింది పొరపాటే అని భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడట సంజీవ్. కానీ భార్య మాత్రం అతని మాట వినకుండా ఇళ్లు విడిచి పోయినట్లు పోలీసులకు తెలిపాడు. ఇక టమాటాకున్న ప్రాధాన్యత ఏంటో సంజీవ్‌కు తెలిసొచ్చింది. జీవితంలో ఇంకోసారి టామాటాతో గేమ్స్ ఆడకూడదని డిసైడ్ అయినట్లు చెప్పాడు.
ఇదండీ స్టోరీ.. టమాటా కూరల్లో వేస్తే ఎంత రుచిని ఇస్తుందో కొన్ని సార్లు అదే టమాటా కన్నెర్ర చేస్తే కాపురాలే కూలిపోతాయనే విషయం సంజీవ్ ఘటనతో రుజువైంది.












Click it and Unblock the Notifications