లష్కరే టాప్ కమాండర్ అబూ కాసిం కాల్చివేత

శ్రీనగర్: లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబూ కాసిం భద్రతా బలగాల కాల్పుల్లో హతమయ్యాడు. శ్రీనగర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో గల బందిపొరాలో భద్రతా బలగాలకు, మిలిటెంట్లకు మధ్య బుధవారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.

ఈ ఎన్‌కౌంటర్‌లో గురువారం తెల్లవారుజామున కాసిం మరణించాడు. ఉద్ధంపూర్ దాడుల ప్రధాన సూత్రధారి కాసిం. ఉద్ధంపూర్‌లో 2013 జూన్‌లో మిలిటెంట్లు జరిపిన దాడిలో ఎనిమిది సైనికులు మరణించారు.

Top LeT commander Abu Qasim gunned down by security forces

బుధవారం సాయంత్రం గస్తీ తిరుతున్న భద్రతా బలగాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు ఆ తర్వాత అటవీ ప్రాంతంలో ఆశ్రయం తీసుకున్నారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 14 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన జవాను ఒకతను గాయపడ్డాడు. చికిత్స పొందుతూ అతను మరణించాడు.

దాంతో భద్రతా బలగాలు అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో కాసిం హతమయ్యాడు. ఇంతకు ముందు కాసి ఇంటలిజెన్స్ పోలీసు అధికారి అల్తాఫ్ అహ్మద్‌ను హత్య చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+