డిగ్గీ, అమృత రాసలీల: వీరికంటే ముందు...! (పిక్చర్స్)
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎఫైర్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రముఖ టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో తాను ప్రేమలో ఉన్నానని, త్వరలో పెళ్లి చేసుకుంటామని డిగ్గీ రెండు రోజుల క్రితం చెప్పారు.
అమృతా రాయ్ కూడా తాను డిగ్గీని పెళ్లాడనున్నట్లు చెప్పారు. తాను తన భర్త నుండి విడిపోయానని, పరస్పరం ఒప్పందంతో విడాకులకు దరఖాస్తు చేసుకున్నామని, విడాకులు మంజూరు కాగానే డిగ్గీని పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పారు.
దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ వయస్సులో దిగ్విజయ్ సింగ్‌కు రెండో పెళ్లి కావాలంట.. అంటూ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. పలువురు రాజకీయ ప్రముఖులు మరో పెళ్లి చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.

దిగ్విజయ్ సింగ్
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాను టీవీ యాంకర్ అమృతా రాయ్‌తో ప్రేమలో ఉన్నానని, ఆమెను త్వరలో పెళ్లి చేసుకుంటానని చెప్పి సంచలనం సృష్టించారు. అమృతా రాయ్ కూడా పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఎన్డీ తివారి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన ఎన్డీ తివారి రాసలీలల ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇటీవలి వరకు ఆయన తనయుడు రోహిత్ శేఖర్.. ఎన్డీ తివారీ తన తండ్రి అంటూ కోర్టులో పోరాడారు.

శశి థరూర్
కేంద్రమంత్రి శశిథరూర్ సునంద పుష్కర్‌ను వివాహమాడారు. ఇటీవలె ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్‌తో శశిథరూర్‌కు సంబంధాలున్నాయని సునంద ఆరోపణలు గుప్పించారు. అనంతరం ఆమె వివాదాస్పద పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారు. మెహర్, శశిలు ఇద్దరు ఆరోపణలను తోసిపుచ్చారు.

అమరీందర్ సింగ్
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు నేత అమరీందర్ సింగ్‌కు పాకిస్తాన్ జర్నలిస్ట్ అరూసా ఆలమ్‌కి సన్నిహిత సంబంధాలు ఉందంటారు. 2004లో ఆయన పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆలమ్ పరిచయం అయింది. అప్పట్నుంచి పంజాబీ రాజకీయాల్లో అంతా గుసగుసలు వినిపిస్తుంటాయి. ఆరూసా ఆలమ్.. చండీగడ్ వచ్చి మరీ అమరీందర్ తనకు స్నేహితుడు తప్ప మరేది లేదని ప్రకటించారు.












Click it and Unblock the Notifications