
యుక్రెయిన్‌లో శ్రీలంక తమిళులపై చిత్రహింసలు: కాలి వేళ్ల గోర్లను పీకేశారు, కడుపులో పిడిగుద్దులు గుద్దారు

ఇటీవల రష్యా ఆక్రమణల నుంచి ఇజ్యుమ్ నగరాన్ని యుక్రెయిన్ విడిపించుకొంది. ఆ నగరంలో రష్యా అరాచకాలకు పాల్పడిందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.
ఇజ్యుమ్‌లో కొందరు శ్రీలంక తమిళులను కూడా నెలలపాటు రష్యా సైనికులు నిర్బంధంలోకి తీసుకున్నారనే వార్తలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
''మేం ప్రాణాలతో అసలు బయటపడతామని అనుకోలేదు''అని దిలుజన్ పత్తినజకన్ చెప్పారు.
గత మే నెలలో రష్యా బలగాలు అదుపులోకి తీసుకున్న ఏడుగురు శ్రీలంక తమిళులలో దిలుజన్ ఒకరు. ఈశాన్య యుక్రెయిన్‌లోని కుపియాన్సెక్ నగరంలోని తమ ఇళ్ల నుంచి 125 కి.మీ. దూరంలో ఖార్కియెవ్‌లో సురక్షిత ప్రాంతాలకు వీరు వెళ్తుండగా రష్యన్లు అదుపులోకి తీసుకున్నారు.
వారికి దారిలో ఎదురైన తొలి చెక్‌పోస్టు వద్దే రష్యా సైనికులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి కళ్లకు గంతలు కట్టారు. చేతులను కూడా కట్టేశారు. ఆ తర్వాత సరిహద్దుల్లోని వోవ్‌చాన్స్‌క్ నగరంలోని ఒక మెషీన్ విడిభాగాల తయారీ ఫ్యాక్టరీకి తీసుకెళ్లారు.
దాదాపు నాలుగు నెలలు పాటు వారితో వెట్టిచాకిరీ చేయించారు. చిత్రహింసలను కూడా పెట్టారు.
- తెలుగువారితోపాటు అనేక రాష్ట్రాల విద్యార్ధులు మెడిసిన్ చదవడానికి యుక్రెయిన్ ఎందుకు వెళుతున్నారు?
- యుక్రెయిన్ సంక్షోభం: భారతీయ విద్యార్థులు, పౌరులను తీసుకురావడం ఎందుకు కష్టంగా మారింది?

(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు కలచివేయొచ్చు)
ఉపాధి లేదా చదువు కోసం ఈ శ్రీలంక తమిళ బృందం యుక్రెయిన్‌కు వచ్చింది. అయితే, వారిని రష్యా బలగాలు.. ఖైదీలుగా నియంత్రణలోకి తీసుకున్నాయి. అతితక్కువ ఆహారాన్ని వీరికి ఇచ్చేవి. రోజులో ఒకసారి కేవలం రెండు నిమిషాలు మాత్రమే టాయిలెట్ ఉపయోగించడానికి అనుమతించేవి. స్నానం కూడా కేవలం రెండు నిమిషాల్లోనే పూర్తి చేయాలని సూచించేవారు.
20ల వయసులో ఉన్న వీరిని ఒకే గదిలో ఉంచారు. ఈ బృందంలోని ఒకే ఒక మహిళ, 50ఏళ్ల మేరీ ఉథజ్‌కుమార్‌ను మాత్రం విడిగా ఉంచారు.
''వారు నన్ను ఒక గదిలో లాక్ చేశారు''అని ఆమె అన్నారు. ''స్నానం చేయడానికి వెళ్లేటప్పుడు వారు కొట్టేవారు. ఇతరులను కలవడానికి కూడా ఒప్పుకునేవారు కాదు. అలానే మేం మూడు నెలలు గడపాల్సి వచ్చింది''అని ఆమె వివరించారు.
శ్రీలంకలో కారు బాంబు పేలుడు వల్ల మేరీ మొహంపై గాయాలయ్యాయి. ఆమె గుండె జబ్బుతో కూడా బాధపడతున్నారు. కానీ, ఆమెకు ఆ వ్యాధికి సంబంధించి ఎలాంటి వైద్యమూ అందించలేదు.
మరోవైపు, అలా ఒంటరిగా ఉంచడం వల్ల వారి మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమైంది.
''ఒంటరిగా ఉండేటప్పుడు, నాకు చాలా గందరగోళంగా అనిపించేది''అని ఆమె వివరించారు. ''నాకు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వారు చెప్పారు. కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారు. కానీ, నేను వాటిని తీసుకోలేదు''అని ఆమె అన్నారు.
మరోవైపు మరికొందరు ఇంకా ఎక్కువ వేదనను అనుభవించాల్సి వచ్చింది. ఒక వ్యక్తి తన కాలి వేళ్ల గోర్లను పట్టకర్రతో ఎలా పీకేశారో తన షూలను విప్పి చూపించారు. మరోవ్యక్తి కూడా తనను ఇలానే చిత్రహింసలు పెట్టారని చెప్పారు.
- నవీన్ శేఖరప్ప: 'ఆహారం కోసం బంకర్ నుంచి బయటకు వెళ్లాడు.. డబ్బులు కావాలని ఫోన్ చేశాడు.. ఆ తర్వాత’
- యుక్రెయిన్‌లో తెలంగాణ విద్యార్థి: ''భయంగా ఉంది. ఒంటరిగా బయటకు వెళ్లే ధైర్యం చాలట్లేదు. ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నా’’

ఎలాంటి కారణం లేకుండా కొట్టేవారు..
రష్యా సైనికులు బాగా మద్యం సేవించి తమను కొట్టేవారని బాధితులు చెప్పారు. అసలు ఎలాంటి కారణం లేకుండానే తమపై దాడులు చేసేవారని వివరించారు.
''చాలాసార్లు గన్లతో నా శరీరంపై దాడి చేశారు''అని 35ఏళ్ల థినేశ్ గోగెంథిరన్ తెలిపారు. ''ఒక వ్యక్తి నా కడుపులో పిడిగుద్దులు గుద్దారు. రెండు రోజులు నాకు నొప్పి అలానే ఉండిపోయింది. ఆ తర్వాత నన్ను డబ్బులు ఇవ్వమని అడిగారు''అని ఆయన వివరించారు.
''మాకు చాలా కోపం వచ్చేది. చాలా బాధగా కూడా అనిపించేది. రోజే ఏడ్చేవాళ్లం''అని 25ఏళ్ల దిల్‌కుషన్ రాబర్ట్‌క్లైవ్ చెప్పారు. ''మేం రోజూ దేవుడికి ప్రార్థన చేసేవాళ్లం. మా కుటుంబ సభ్యులను రోజూ తలచుకునేవాళ్లం''అని ఆయన చెప్పారు.
పౌరులపై దాడులు చేసినట్లు లేదా యుద్ధ నేరాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను రష్యా ఖండించింది. అయితే, శ్రీలంక తమిళులతోపాటు మరికొందరు కూడా రష్యా సైనికులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.
ఇజ్యుమ్‌లోని ఒక శ్మశానం నుంచి భారీగా మృతదేహాలను యుక్రెయిన్ తవ్వితీసింది. కొన్ని మృతదేహాలపై చిత్రహింసలు పెట్టిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి.
- కీయెవ్ వీధుల్లో నాటు బాంబులు తయారు చేస్తున్న యుక్రెయిన్ మహిళలు
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
''మరోవైపు ఖార్కియెవ్ ప్రాంతంలోని నగరాలు, పట్టణాల్లోనూ పదికిపైగా చిత్రహింసలు పెట్టే ప్రాంతాలను గుర్తించాం''అని యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలియెన్‌స్కీ చెప్పారు.
వోవ్‌చాన్స్‌క్ నగరంలోపాటు తూర్పు యుక్రెయిన్‌లోని చాలా ప్రాంతాలను ఈ నెల మొదటి వారంలో యుక్రెయిన్ సైన్యం క్రమంగా తమ నియంత్రణలోకి తీసుకోవడం మొదలుపెట్టింది. దీంతో ఈ ఏడుగురు శ్రీలంక తమిళులకు విముక్తి లభించింది.
రష్యా సైన్యం నుంచి బయటపడిన తర్వాత, వీరు ఖార్కియెవ్ దిశగా మళ్లీ పయనం మొదలుపెట్టారు. ఒంటరిగా ఉండటంతోపాటు ఫోన్లు కూడా వీరి దగ్గర లేకపోవడంతో.. తమ కుటుంబాలతో మాట్లాడటం వీరికి కష్టమైంది.
మొత్తానికి అదృష్టవశాత్తు దారిలో కొందరు వీరికి సాయం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. అప్పుడు ఒక అధికారి ఫోన్ కూడా ఇచ్చారు.
40ఏళ్ల ఐంకరనాథన్ గణేశమూర్తి ఫోన్ స్క్రీన్‌లో తన భార్య, కుమార్తెలను చూసినప్పుడు కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. మిగతవారి కళ్లలోనూ ఇలానే నీళ్లు వచ్చాయి.
మొత్తానికి ఈ బృందం ఖార్కియెవ్ చేరుకోవడానికి అధికారులు సాయం చేశారు. అక్కడ వారికి వైద్య సాయంతోపాటు కొత్త బట్టలు కూడా అందించారు. ఇప్పుడు వారు పునరావాస కేంద్రాల్లో హాయిగా నిద్రపోతున్నారు.
''ఇప్పుడు నాకు చాలా, చాలా సంతోషంగా ఉంది''అని నవ్వుతూ దిల్‌కుషన్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ట్రాక్టర్ కొనడానికి మహీంద్రా ఫైనాన్స్ నుంచి రుణం తీసుకున్న తండ్రి.. రికవరీకి వచ్చి గర్భిణిని కారుతో తొక్కించిన ఏజెంట్లు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మిథాలీ రాజ్: 'క్రికెట్ కిట్ పట్టుకుని వెళ్తే.. హాకీ ప్లేయర్వా? అని అడిగేవారు’
- యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్రూమ్ వీడియోలు లీక్.. 8 మంది అమ్మాయిల ఆత్మహత్యాయత్నం
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)