మనదేశంలో ఎవరికీ తెలియని అద్భుతమైన 5 పర్యాటక ప్రాంతాలివే..!

భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. మనదేశం ఎన్నో చారిత్రక కట్టడాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు నెలవు. హిమాలయ పర్వతాల నుంచి కన్యాకుమారి వరకు అలాగే జైసల్మేర్ ఎడారి, ఇసుక దిబ్బల నుంచి కేరళలోని అందాల వరకు దేశంలోని ప్రతి రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు టూరిస్టులను ఆహ్వానిస్తున్నాయి. అయితే దేశంలో చాలా అద్భుతమైన ఐదు పర్యాటక ప్రాంతాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఈ టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించేందుకు పర్యటకులు రావడం చాలా అరుదు. కానీ వీటి గురించి తెలిసిన వాళ్లు మాత్రం లైఫ్ లో ఒక్కసారైనా అక్కడకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు.

హిమాచల్ ప్రదేశ్ లోని ఖజ్జియార్ ప్రాంతం గురించి చాలా మందికి తెలియదు. స్థానికులు ఇక్కడి ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తుంటారు. ఈ ప్రాంతం చాలావరకు మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడి పచ్చని పచ్చిక బయళ్లు, పైన్ అడవులు పర్యటకులను కనువిందు చేస్తాయి. అలాగే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక వైభవాన్ని కూడా చాటుతోంది. నాగ దేవుడైన ఖజ్జీ నాగ ఆలయం ఇక్కడే ఉంది. అలాగే కలతోప్ ఖజ్జియార్ అభయారణ్యం చాలా ఫేమస్. ఇక ఈ ప్రాంతం ఖజ్జీ పఠాన్ కోట్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే కాంగ్రాలోని గగ్గల్ విమానాశ్రయం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అలాగే రాజస్థాన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఎడారి ప్రాంతం. జైసల్మేర్ లోని ఇసుక దిబ్బలను గోల్డెన్ డెజర్ట్ గా పిలుస్తుంటారు. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఇక్కడి ఇసుక కిరణాల వల్ల గోల్డెన్ కలర్ లోకి మారుతుంది. ఈ సమయంలో ఇసుక తిన్నెలను చూస్తే మరొక ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక జైసల్మేర్ నుంచి సాండ్ డూన్స్ వరకు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఒంటెలమీద సవారీలు, జీప్ సఫారీలు, క్యాంపింగ్, రాత్రిపూట నక్షత్రాలను చూడడం, సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి.

ఇక కర్నాటకలోని సెయింట్ మేరీస్ ఐలాండ్‌ గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సీక్రెట్ బీచ్ అని పిలుస్తుంటారు. అలా పిలవడానికి ఓ కారణం ఉంది. ఇక్కడి అగ్నిపర్వత శిలా రూపాలు భూమిపై చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. నీలి సముద్రం, సహజ సిద్ధమైన రాళ్లు ఈ ప్రదేశాన్ని కట్టిపడేస్తుంటాయి. అలాగే ఇక్కడి అందమైన బీచ్‌ పర్యాటకులను ఆకర్షిస్తోంది. మాల్పే బీచ్ నుంచి 30 నిమిషాలు పడవలో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.

Tourist Destinations in India That Nobody Knows About 5 Amazing secret tourist destinations India

అలాగే లడఖ్‌ లోని లమయూరు ప్రాంతం పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. లమయూరు ప్రాంతానికి మూన్ లాండ్, చంద్రలోక్ అనే పేరు వచ్చింది. ఇక్కడికి వెళ్తే వేరే గ్రహానికి చేరుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ 11 వ శతాబ్దానికి చెందిన పురాతన బౌద్ద మోనాస్టరీ ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం లేహ్ నుంచి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. టాక్సీ ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.

మరోవైపు కశ్మీర్‌ లోని ఓ చిన్న గ్రామమే అగ్రంగ్ కేల్. ఈ గ్రామం పెయింటింగ్ మాదిరి అందంగా ఉంటుంది. చుట్టూ నిశబ్దం, మంచుతో కప్పబడిన పర్వతాలు ప్రాంతానికి మరింత వన్నెను తీసుకొస్తాయి. అందుకే కశ్మీర్‌లోని అగ్రంగ్ కేల్‌ను భారత్ బ్లూ లగూన్ అని పిలుస్తుంటారు. ఇక్కడ ట్రెక్కింగ్ సదుపాయం కూడా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+