వైరల్ వీడియో: మరో స్లీపర్ బస్సు మంటల్లో దగ్దం..

స్లీపర్ బస్సు ఎక్కాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం మరువక ముందే మరోసారి స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఆగ్రా- లఖ్ నవూ ఎక్స్ ప్రెస్ వే పై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. అగ్నికీలల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధం అయింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. వరుస ప్రమాదాల ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఈ ఘటనను మరువక ముందే మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లఖ్ నవూ సమీపంలో ఈ ఘటన జరిగింది. 39 మంది ప్రయాణికులతో దిల్లీ నుంచి గోందాకు వెళ్తున్న స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారజామున 4 గంటల 45 నిమిషాల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆగ్రా- లఖ్ నవూ ఎక్స్ ప్రెస్ వే పై టోల్ ప్లాజాకు 500 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

అయితే స్లీపర్ బస్సుకు మంటలు వ్యాపించిన గంటలో మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్పష్టం చేశారు.

Tragedy on Agra-Lucknow Expressway Sleeper Bus Engulfed in Flames

స్లీపర్ బస్సు ఆగ్రా- లఖ్ నవూ ఎక్స్ ప్రెస్ వే పై దిల్లీ నుంచి గోందా వెళ్తున్న క్రమంలో టైర్ పేలింది. వెంటనే బస్సులోని ప్రయాణికులను తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. అయితే మంటల్లో బస్సు తగలబడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా బస్సును రోడ్డుపై నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+