20 ఏళ్ల యువతిపై అత్యాచారం.. ప్రైవేట్ భాగాల్లో..!!

Mumbai: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. పండు ముసలి నుంచి చిన్న పిల్లల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని ముంబైలో దారుణం జరిగింది. 20 ఏళ్ల మహిళపై అత్యాచారం ఆరోపణలపై ఆటో డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బీచ్ లో అత్యాచారం

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని నలసోపోరా నివాసి అయిన మహిళ తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులతో కలిసి నివసిస్తోంది. జనవరి 21న ఇంట్లో గొడవ జరగడంతో ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చింది. ఇంటి నుంచి బయటకు వచ్చి నలసోపోరా రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అక్కడ ఓ ఆటోడ్రైవర్ ను కలుసుకుని తన కుటుంబ సమస్యలను పంచుకుంది. అదే అదునుగా తీసుకున్న ఆటో డ్రైవర్ ఆమెను ఆర్నాలా బీచ్ కు తీసుకువెళ్లాడు. వారిద్దరూ రాత్రంతా అక్కడే గడిపారు. అయితే, ఆమె వద్ద చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు లేకపోవడంతో, వారికి హోటల్ గది దొరకకపోవడంతో ఆ రాత్రి బీచ్‌లో గడిపారు. అప్పుడే ఆమెపై అత్యాచారం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

Tragic Aftermath Mumbai Woman Self-Harms After Rape to Escape Family s Anger

ప్రైవేట్ భాగాల్లో బ్లేడ్, రాళ్లు..

ఆ తర్వాత ఆటోడ్రైవర్ నేరం జరిగిన ప్రదేశం నుండి పారిపోయాడు. అనంతరం ఆ మహిళ నలసోపోరాలోని రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కానీ ఇంటికి తిరిగివస్తే తన తల్లిదండ్రులకు విషయం తెలుస్తుందని భయపడి.. కుటుంబ సభ్యులు ఆమెను కొట్టకూడదు.. అందుకే, ఆ మహిళ ఒక మెడికల్ స్టోర్ నుంచి సిజేరియన్ బ్లేడ్ కొని, ఏకాంతంగా తన ప్రైవేట్ పార్ట్స్ లోకి చొప్పించుకుంది.

అంతా అబద్ధమే..

ఆమెకు నొప్పి రావడం ప్రారంభం కావడంతో పోలీసులను ఆశ్రయించగా.. ఆటో డ్రైవర్ పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ మహిళ తనకు తల్లిదండ్రులు లేరని పోలీసులకు ముందే చెప్పింది, కానీ అదంతా అబద్ధమని తేలింది. 2023 సంవత్సరంలో నిర్మల్ నగర్, శివాజీ నగర్ పోలీస్ స్టేషన్లలో ఇద్దరు వ్యక్తులపై బాలిక అత్యాచారం కేసు నమోదు చేసిందని బాధితురాలి తండ్రి పోలీసులకు తెలిపారు.

నిందితుడు అరెస్ట్

మహిళను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా, సర్జికల్ బ్లేడ్ , రాళ్లను ఆమె ప్రైవేట్ భాగాలలో బలవంతంగా చొప్పించినట్లు వెల్లడైంది. వైద్యులు ఆ వస్తువులను తొలగించారు, ఆమె ఫిర్యాదు మేరకు ఆటోరిక్షా డ్రైవర్‌పై అత్యాచారం కేసు నమోదు చేశారు. ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా మహిళకు మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులను విచారించగా ఆమె తరచుగా ఇంటి నుంచి వెళ్లిపోవడం.. మానసిక సమస్యలతో బాధపడటం వంటి విషయాలను పోలీసులకు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+