మరో ఘోర ప్రమాదం.. నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు
దేశంలో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 265 మంది ప్రాణాలు కోల్పాయారు. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పూణెలోని ఇంద్రయాణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 25 నుంచి 30 మంది టూరిస్టులు నీళ్లలో కొట్టుకుపోయినట్లు సమాచారం అందుతోంది.

మహారాష్ట్ర పుణెలో ఘోర ప్రమాదం జరిగింది. పుణెలోని ఇంద్రయాని నదిపై ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 25 నుంచి 30 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు ఆరుగురిని సురక్షితంగా కాపాడినట్లు సమాచారం. మరి కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
#Pune, Maharashtra: A bridge over the Indrayani River collapsed in Kundamala, Maval taluka of Pune, causing 25–30 tourists to fall into the river. Heavy rains had raised water levels.
— All India Radio News (@airnewsalerts) June 15, 2025
Local police, fire brigade, and NDRF teams rushed to the site and launched a rescue operation.… pic.twitter.com/pvdJmll3iA
ఇంద్రయాని నదిపై ఉన్న బ్రిడ్జ్ పురాతనమైనది కావడంతో భారీ వర్షాలకు కుప్పకూలినట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు పోలీసులు. నదిలో కొట్టుకుపోయిన టూరిస్టులకోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో నదిని గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications