ఆ మొబైల్ నంబర్లలో డేటా ఏమవుతుంది ? సుప్రీంలో ట్రాయ్, వాట్సాప్ క్లారిటీ..!
మొబైల్ నంబర్లు వాడుతున్న వారు ఏదైనా కారణంతో దాన్ని రద్దు చేసుకోవడం కానీ, డీయాక్టివేట్ చేసుకున్నప్పుడు 90 రోజుల తర్వాత దాన్ని తిరిగి పొందే అవకాశం ఉండదు. అయితే ఇలా వాడకుండా వదిలేసిన నంబర్లలో సేవ్ అయిన డేటా ఏం జరుగుతుంది ? దీనిపై సుప్రీంకోర్టులో ట్రాయ్, వాట్సాప్ ఇవాళ క్లారిటీ ఇచ్చాయి. ఇలా వదిలేసిన నంబర్లను 90 రోజుల తర్వాత మరొకరిటి కేటాయిస్తామని ట్రాయ్ క్లారిటీ ఇస్తే 45 రోజుల తర్వాత వాటిలో డేటా తొలగిస్తామని వాట్సాప్ తెలిపింది.
మన దేశంలో వేర్వేరు కారణాలతో రద్దు చేసుకున్న లేదా డీయాక్టివేట్ చేసుకున్న నంబర్లను 90 రోజుల తర్వాత మాత్రమే తిరిగి మరొకరికి కేటాయిస్తామని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది. వ్యక్తుల యొక్క సమాచార గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇలా ఒకరు వాడి రద్దు చేసుకున్న లేదా డీయాక్టివేట్ చేసుకున్న నంబర్లను ఇతరులకు వెంటనే కేటాయించడం వల్ల సమాచార గోప్యత ప్రమాదంలో పడుతుందన్న పిటిషన్ పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు బెంచ్ కు ట్రాయ్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది.

ఇదే అంశంపై 2021లో దాఖలైన ఓ రిట్ పిటిషన్ పై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. ట్రాయ్ అభిప్రాయం కోరింది. దీంతో స్పందించిన ట్రాయ్.. రద్దుచేసుకున్న లేదా డీయాక్టివేట్ చేసుకున్న మొబైల్ నంబర్లను వెంటనే ఇతరులకు కేటాయించడం లేదని, దానికి 90 రోజుల గడువు పెట్టినట్లు వెల్లడించింది. తద్వారా అంతకు ముందు సదరు నంబర్ ను వాడిన వారి వ్యక్తిగత డేటా భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని ట్రాయ్ అభిప్రాయపడింది.
అదే సమయంలో వినియోగదారులు కూడా తమ రద్దు చేసిన లేదా డీయాక్టివేట్ చేసుకున్న మొబైల్ నంబర్ల డేటా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాయ్ సూచిస్తోంది. మరోవైపు ఇలాంటి నంబర్ల విషయంలో సేవ్ చేసిన డేటా విషయంలో వాట్సాప్ కూడా సుప్రీంకోర్టుకు తమ నిబంంధనలు వెల్లడించింది. ఇలా యాక్టివ్ గా లేని నంబర్ల విషయంలో 45 రోజుల తర్వాత కొత్త మొబైల్ ఫోన్ లో వేసినా డేటా మాత్రం అందుబాటులో ఉండదని క్లారిటీ ఇచ్చింది.












Click it and Unblock the Notifications