ఏసీ కోచ్ బుక్ చేసుకున్నా.. దీపావళి పండుగ చేసుకోలేకపోయా: రైల్వే మహిమ!!

ఇండియన్ రైల్వే అధికారుల పట్టింపులేని తనం, పండుగ సమయంలో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా రైళ్లను ఏర్పాటు చేయకపోవడం వెరసి ఈ దీపావళి పండుగకు చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. తాము అనుకున్న గమ్యాలకు చేరుకోలేక, పండుగ చేసుకోలేకపోయారు. ముందుగానే రైల్వే టికెట్లను రిజర్వేషన్ చేసుకున్నప్పటికీ, ఏసీ కోచ్ లలో టికెట్టు బుక్ చేసుకున్నప్పటికీ ప్రయాణం చేయలేని పరిస్థితికి వారు అసహనం వ్యక్తం చేశారు.

సాధారణంగా రిజర్వేషన్ చేసుకున్న బోగిలలో, జనరల్ టికెట్ తీసుకున్న వారు కొంతమంది ఎక్కుతూ ఉంటారు. అది రిజర్వేషన్ చేసుకునే వారికి కాస్త అసౌకర్యాన్ని కలిగించినప్పటికీ, కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు. అయితే ఏసీకోచ్ లలో బుక్ చేసుకునే వారికి ఈ సమస్య పెద్దగా ఉండదు. కానీ దీపావళి సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం వెళుతున్న ఏసీ కోచ్ లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

train passenger shocking post on Railway worst management in diwali time

అన్షుల్ శర్మ అనే ప్రయాణికుడు థర్డ్ క్లాస్ ఏసి టికెట్ బుక్ చేసుకున్నా.. అతడు కనీసం కంపార్ట్మెంట్ లోకి ఎక్కలేకపోయాడు. అతను ఎక్కాల్సిన కంపార్ట్మెంట్ నిండా క్రిక్కిరిసిపోయిన జనం ఉండడంతో లోపలికి అడుగు పెట్టలేకపోయాడు. తన టికెట్ కన్ఫర్మ్ అయ్యిందని, తను లోపలికి వెళ్లేందుకు సహకరించాలని అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బందికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.

వారందరిని పక్కకు నెట్టి దారి ఇవ్వడం తమ వల్ల కాదని ఆర్పీఎఫ్ సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అన్షుల్ శర్మ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇంత పనికిమాలిన నిర్వహణ ఎక్కడ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, నన్ను దీపావళి పండుగ చేసుకోనివ్వనందుకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.

థర్డ్ క్లాస్ ఏసీలో టిక్కెట్ బుక్ చేసుకున్న తనను ట్రైన్ ఎక్కనివ్వకుండా చేశారని అసహనం వ్యక్తం చేశారు. భద్రత సిబ్బంది నుండి తనకి ఎటువంటి సహకారం అందలేదని, తనదే కాదు చాలామంది ప్రయాణికులది ఇదే పరిస్థితి అంటూ ఆయన పేర్కొన్నారు .ఇక దీనికి సంబంధించిన వీడియోలను కూడా ఆయన సోషల్ మీడియా ఖాతాలో జత చేశారు. తను టికెట్ కోసం చెల్లించిన మొత్తం డబ్బును తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+