Flight Crash: ఆలయా శిఖరాన్ని ఢీకొట్టిన విమానం..

మధ్యప్రదేశ్‌లోని రేవాలో ట్రైనీ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక పైలట్ మృతి చెందగా, మరో ట్రైనీ పైలట్ పరిస్థితి విషమంగా ఉంది. గురువారం రాత్రి 11.30 నుంచి 12 గంటల మధ్య ప్రమాదం జరిగింది. విమానం ఆలయ శిఖరాన్ని తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణం పొగమంచు అని ప్రాథమిక దర్యాప్తులో అంచనాకు వచ్చారు.

కెప్టెన్ విమల్ కుమార్

కెప్టెన్ విమల్ కుమార్

రాత్రి 11.30 గంటలకు పైలట్ కెప్టెన్ విమల్ కుమార్ పాట్నాకు చెందిన విద్యార్థి సోనూ యాదవ్‌కు శిక్షణ ఇస్తున్నాడు. సోనూ యాదవ్‌ ఫ్లైట్ నడుపుతుండగా విమల్ పక్కన ఉండి సూచనలు చేస్తున్నాడు. ఈ క్రమంలో పొగమంచు వల్ల సరిగా కనిపించకపోవం, సోనూ సరైన అవగాహన లేకపోవడంతో విమానం ఆలయా శిఖరాన్ని ఢీకొట్టింది. ఈ సమయంలో భారీ పేలుడు సంభవించి విమాన శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

ఫాల్కన్ కంపెనీ

ఫాల్కన్ కంపెనీ

దీంతో ఈ ప్రాంతంలోని ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు భయంతో బయటకు వచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
రేవా ఎయిర్‌స్ట్రిప్‌ను విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తున్నారు. ఫాల్కన్ కంపెనీ రేవాలోని పైలట్ ట్రైనింగ్ సెంటర్‌లో ట్రైనీలకు శిక్షణ ఇస్తుంది. గురువారం అర్థరాత్రి అటువంటి శిక్షణా కార్యక్రమంలో ఈ ప్రమాదం జరిగింది.

రాజస్థాన్‌


5 నెలల క్రితం రాజస్థాన్‌లో వైమానిక దళానికి చెందిన మిగ్-21 బైసన్ (ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్) యుద్ధ విమానం కూలిపోయింది. అందులో మంటలు చెలరేగి దాదాపు అర కిలోమీటరు పరిధిలో శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్లిద్దరూ దుర్మరణం పాలయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+