ఇక నుంచి రైలు ప్రయాణం చేసేటప్పుడు ఇలా చేయండి

ఒడిసా రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాద నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ రైల్వే బీమా గురించి అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రయాణికుడికి భారతీయ రైల్వే రూ.10 లక్షల వరకు బీమా కల్పిస్తోంది. ప్రమాదంలో అంగ వైకల్యానికి గురైతే రూ.10 లక్షల బీమా, తీవ్రంగా గాయపడి అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షల వరకు బాధితుడికి రైల్వే అందజేస్తుంది. ఒక్క రూపాయికన్నా చాలా తక్కువతో రైల్వే ఈ సౌకర్యాన్ని కల్పించింది.

వెబ్ సైట్ లో పాప్ అప్ వస్తుంది:ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తోంది. అయితే చాలామంది ప్రయాణికులు దీనిపై అవగాహన లేకుండా ఉంటారు. ఐాఆర్ సీటీసీ వెబ్ సైట్ లో ఒక పాప్ అప్ వస్తుంది. దీన్ని తెరిచి 35 పైసల రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఫోన్ కు, మెయిల్ కు ఒక లింకు వస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ఆ లింక్ ను తెరిచి నామినీ వివరాలు పొందుపరచాలి. ఒకవేళ నామినీని పేర్కొనకపోతే బీమాను క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం లభించదు. బీమా చేయించుకున్న ప్రయాణికులు దురదృష్టవశాత్తు రైలు ప్రమాదంలో మరణిస్తే.. వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకువెళ్లేందుకు అయ్యే ఖర్చుల కోసం మరో రూ.10వేల బీమాను కంపెనీ కల్పిస్తోంది.

travel insurance in train journey by irctc website

ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?:ప్రమాదం జరిగి మరణించినా, అంగ వైకల్యం కలిగినా ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దానికోసం నామినీగా ఉన్న వ్యక్తి అందుకు సంబంధించిన పత్రాలు తీసుకొని కంపెనీని సంప్రదించాలి. వాటిని పరిశీలించిన తర్వాత 4 నెలల్లోపు సొమ్మును బాధితులకు అందజేస్తారు. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ కొందరు.. తెలియక మరికొందరు వదిలేస్తుననారు. 35 పైసల ఇన్సూరెన్స్ సొమ్మును చెల్లించి బీమాను పొందొచ్చు. ఇకనుంచి రైలు ప్రయాణం చేసే సమయంలో బీమా తీసుకోవాలి. దీనిపై అవగాహన లేనివారికి ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత అన్ని వివరాలు తెలిసిన వ్యక్తులపై ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+