మమత బెనర్జీ తాజా ఎత్తుగడ- తృణమూల్ లోగో విషయంలో

పశ్చిమ బెంగాల్ లో అధికారాన్ని కోల్పోయిన అనంతరం తృణమూల్ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు తీవ్రం అయ్యాయి. ఇప్పటికే పార్టీ రెండుగా చీలింది. మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటికి వెళ్లిపోయారు. అసలు టీఎంసీ ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయింది. ఎన్నికలు ముగిసిన నెల రోజుల్లోపే తృణమూల్ మొత్తం కూడా చెల్లాచెదురైంది. పార్టీ అధినేత్రి మమత బెనర్జీ, ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సహా పార్టీ సీనియర్లు కేసులను ఎదుర్కొంటోన్నారు.

ఈ పరిణామాల మధ్య మమత బెనర్జీ తాజా ఎత్తుగడ వేశారు. పార్టీ అధికారిక గుర్తును ఫోర్జరీ చేయడంతో పాటు, పేరును దుర్వినియోగం చేస్తూ కొందరు నేతలు ప్రైవేట్ గా సమావేశాలు నిర్వహించారనే అంశాన్ని తెరమీదికి తెచ్చారు. ఈ క్రమంలో పార్టీ లీగల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అరూప్ రాయ్, రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహా, బిప్లబ్ మిత్రతో కూడిన చీలికవర్గంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

Trinamool Congress Lodges Complaint of Forged Party Symbol Impersonation at Novotel Kolkata Meeting

ఈ మేరకు కోల్‌కతాలోని బిధాన్‌నగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని న్యూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. తృణమూల్ జాతీయ సంయుక్త కార్యదర్శి, రాజ్యసభ సభ్యురాలు డోలా సేన్ పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు. ఈ నెల 22న న్యూ టౌన్‌ నోవోటెల్ హోటల్ వేదికగా కొందరు నాయకులు అనధికారికంగా సమావేశమయ్యారని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

నోవోటెల్ హోటల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధికారిక గుర్తు, పేరును పోలి ఉండే బ్యానర్లు, నకిలీ పోస్టర్లను పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు చేశారని డోలా సేన్ గుర్తు చేశారు. పార్టీ కిందిస్థాయి కార్యకర్తలను తప్పుదోవ పట్టించేలా అది పార్టీ అధికారిక ప్రత్యేక సమావేశం అనే భ్రమను కల్పించారని పేర్కొన్నారు. ఈ కుట్రకు సంబంధించి నోవోటెల్ హోటల్ లోని గదుల బుకింగ్ వివరాలపై కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.

ఈ కుట్రలో కీలక పాత్రధారిగా ఉన్న రితబ్రత బెనర్జీపై మరింత తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆయన టీఎంసీ అధికారిక లెటర్ హెడ్‌ను నకిలీగా సృష్టించి, తద్వారా తనను తాను పార్టీ "జనరల్ సెక్రటరీ"గా పేర్కొంటూ పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్‌కు ఒక లేఖను కూడా సమర్పించారు. జూన్ 22 నాటి లేఖ ఫోటోస్టాట్ కాపీని కూడా పోలీసులు సమర్పించిన ఫిర్యాదు పత్రానికి జతచేశారు. ఈ నకిలీ పత్రాల ద్వారా అసెంబ్లీ వ్యవహారాల్లో మోసపూరితంగా వ్యవహరించారని డోలా సేన్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+