సస్పెన్షన్ పై టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు-ఈసారీ వెనక్కి తీసుకోవాల్సిందే

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటికే రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ కు నిరసనగా రోజూ విపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తూ సభా కార్యకలాపాల్ని అడ్డుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇవాళ సాయంత్రం నిరసన వ్యక్తం చేస్తున్న మరో తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ పై రాజ్యసభ సస్పెన్షన్ వేటు వేసింది.

రాజ్యసభలో ఎన్నికల చట్టాల సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తీవ్ర నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఆయన రూల్ బుక్కును తీసుకుని ఛైర్మన్ స్ధానంలో ఉన్న సస్మిత్ పాత్రాపై దాన్ని విసిరికొట్టారు. దీంతో సభలో ఉన్న పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి మురళీధరన్ ఆయనపై సస్పెన్షన్ వేటు ప్రతిపాదించడం, ఛైర్మన్ స్ధానంలో ఉన్న సస్మిత్ పాత్రా అమలు చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే దీనిపై స్పందించిన ఓబ్రెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

trinamool congress mp derek obrien reaction on his suspension from rajya sabha, remind flashback

గతంలో వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకించినప్పుడు తనపై చివరిసారిగా సస్పెన్షన్ వేటు పడిందని డెరెక్ ఓబ్రెయిన్ వెల్డడించారు. ఆ తర్వాత కేంద్రం వ్యవసాయ బిల్లుల్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అయితే ఈసారి ఎన్నికల చట్టాల సవరణ బిల్లును వ్యతిరేకించానని తెలిపారు. ఈసారి కూడా ఎన్నికల చట్టాల సవరణను వెనక్కి తీసుకోక తప్పదని ఓబ్రెయిన్ హెచ్చరించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓబ్రెయిన్ సస్పెన్షన్ నిర్ణయంపై తన సొంత పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. మరో రెండు రోజుల్లో పార్లెమంటు శీతాకాల సమావేశాలు ముగియనున్న తరుణంలో ఈ రెండు రోజుల పాటు కూడా ఇరుసభల్లో ఆందోళనలకు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+