రాజ్యసభకు రేపే ట్రిపుల్ తలాక్ బిల్లు!: ఎంపీలకు విప్ జారీ

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్రం భావిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లు మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే లోకసభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపితే చట్టంగా మారుతుంది.

ముస్లిం మహిళల రక్షణే ప్రధానంగా కేంద్రం ఈ బిల్లును శీతకాల సమావేశంలో ప్రవేశపెట్టింది. జనవరి 5తో శీతాకాల సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Triple Talaq bill likely to be tabled in Rajya Sabha tomorrow

మంగళవారం ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో
బీజేపీ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. లోకసభలో సవరణలేమీ లేకుండానే ఆమోదం పొందిన ఈ బిల్లు.. రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The much anticipated Triple Talaq Bill will be tabled in Rajya Sabha on Tuesday. The Bill making triple talaq illegal with up to three years in jail for the husband has taken another step with the Lok Sabha passing it.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి