త్రిపుర తూర్పు లోక్ సభ ఎన్నిక వాయిదా .. ఎందుకంటే
Recommended Video
త్రిపుర తూర్పు లోక్ సభ నియోజకవర్గానికి జరగాల్సిన ఎన్నిక వాయిదా పడింది. ఏప్రిల్ 18న రెండోదశలో భాగంగా త్రిపుర(తూర్పు) లోక్‌సభ స్థానానికి జరగాల్సి ఎన్నికను ఎన్నికల సంఘం(ఈసీ) మూడోదశలో జరిగే ఏప్రిల్ 23న జరపాలని నిర్ణయం తీసుకుంది .

శాంతి-భద్రతలు అదుపులో లేని కారణంగా ఎన్నిక వాయిదా
స్థానికంగా శాంతి-భద్రతలు అదుపులో లేవని, స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరిగే అవకాశం లేదని, అసాంఘిక శక్తులు ఎన్నికలకు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉందని త్రిపుర ముఖ్య ఎన్నికల అధికారి, ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడు ఇచ్చిన నివేదిక మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ నివేదికలో తేలిన కారణంగా అదనపు కేంద్ర బలగాలను పంపించాలని ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు .

తోలి విడత ఎన్నికల్లో అల్లర్ల దృష్ట్యా ఏప్రిల్ 23పోలింగ్ కు భద్రత పెంపు
తొలి విడత జరిగిన ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తిన చోట వీడియో ఫుటేజ్ చూసామని , ఎక్కడెక్కడ అల్లర్లు జరిగాయో అవి అన్నీ ఎన్నికల సంఘానికి పంపించామని త్రిపుర ఎన్నికల ప్రధానాధికారి శ్రీరాం తరనికంటి చెప్పారు . ఏప్రిల్ 23 న జరగనున్న పోలింగ్ లో ఎలాంటి ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఒక పక్క కాంగ్రెస్, సీపీఐ పార్టీలు 460 పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని తిరిగి అక్కడ రీ పోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

రిగ్గింగ్ జరిగిన చోట తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటున్న కాంగ్రెస్ , సీపీఐ నాయకులు
ఏప్రిల్ 11 న వెస్ట్ త్రిపుర లోక్ సభ ఎన్నికల్లో స్పష్టంగా రిగ్గింగ్ జరిగిందని ఆయన త్రిపుర కాంగ్రెస్ నాయకులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) చట్టబద్దమైన బృందంతో పాటు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇక ఈసీ 23న త్రిపుర తూర్పు లోక్ సభ ఎన్నికలు జరపాలని నిర్ణయించటంతో త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రడియాట్ కిషోర్ డబ్బర్మాన్ ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని స్వాగతించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications