త్రిషకు విజయ్ ఊహించని పదవి,కేరాఫ్ ఢిల్లీ - అక్కడే అసలు ట్విస్ట్..!!
తమిళనాడు సీఎం విజయ్ నిర్ణయాలు ఆసక్తి కరంగా మారాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి న తరువాత పాలనా పరంగా తన మార్క్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ తరువాత.. మిత్రపక్షాలతో కలిసి అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ కూటమిలో అధికారికంగా చేరేందుకు సిద్దం అవుతున్నారు. అటు డీఎంకే.. అన్నా డీఎంకే విజయ్ అడుగులకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో త్రిషకు కీలక పదవి అప్పగించే విధంగా ప్రయత్నాలు సాగుతున్నట్లు టీవీకే నేతలు చెబుతున్నారు.
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత త్రిషకు దక్కే హోదా పైన పలు రకాల అంచనాలు వినిపించాయి. విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి సీటు నుంచి త్రిషను బరిలోకి దింపుతారనే ప్రచారమూ జరిగింది. విజయ్ మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వం నడుపుతున్న వేళ.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించటం లేదు. ఇదే సమయంలో టీవీకే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత రాష్ట్రంలో తొలి సారి రాజ్యసభ ఎన్నిక జరగనుంది.

అన్నా డీఎంకే నేత షణ్ముగం రాజీనామాతో ఈ ఉప ఎన్నిక జరుగుతంది. అసెంబ్లీలో విజయ్ కు 144 మంది ఎమ్మెల్యే మద్దతు ఉండటంతో ఈ సీటు టీవీకే కూటమికే దక్కనుంది. ఈ సీటు కాంగ్రెస్ తో సహా మిత్రపక్షాలు ఆశిస్తున్నాయి. కాగా.. మిత్రపక్షాలకు కేబినెట్ లో అవకాశం కల్పించటం.. ఆ పార్టీల నేతలకు నామినేటెడ్ పోస్టుల పైన విజయ్ హామీ ఇచ్చారు. ఆ దిశగా కసరత్తు జరుగుతోంది.
కాగా, విజయ్ గెలుపు కోసం తెర వెనుక తన వంతు పాత్ర పోషించిన సినీ నటి త్రిషకు రాజ్యసభ సీటు కేటాయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే.. ఈ సీటు కోసం విజయ్ పైన కాంగ్రెస్, వీసీకే నేతలు ఒత్తిడి తెస్తున్నారు. అటు రజనీకాంత్ తో బీజేపీ.. స్టాలిన్ తన సంఖ్యా బలంతో విజయ్ పైన గురి పెట్టారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీ రజనీకాంత్ ను రాజ్యసభ కు నామినేట్ చేస్తుందనే ప్రచారం సాగుతోంది.
దీంతో.. బీజేపీ అటు రజనీకాంత్ కు అవకాశం కల్పిస్తే.. త్రిష తో కౌంటర్ చేసేందుకు విజయ్ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నిర్ణయాల కు అనుగుణంగా కౌంటర్ ప్లాన్ సిద్దం చేయాలని విజయ్ భావిస్తున్నారు. దీంతో.. మిత్రపక్షాలతో చర్చల తరువాత విజయ్ రాజ్యసభ అభ్యర్ధి పైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications