వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7 నెలలో ప్రభుత్వం పడిపోవడం ఖాయం..? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామలో బండి సంజయ్ పాదయాత్రపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఆ దాడిని మంత్రి సమర్ధించుకోవడం దారుణం అని అభిప్రాయపడ్డారు. డి సంజయ్ పాదయాత్రతో టీఆర్ఎస్ పీఠాలు కదిలిపోతున్నాయని.. అందుకే భౌతికదాడులకు దిగుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్ని దాడులు చేసినా.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు పాతరేస్తారని హెచ్చరించారు.

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరు రక్షించలేరని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎన్ని దాడులు జరిగినా.. ప్రజలు టీఆర్ఎస్‌ పార్టీని ఓడిస్తారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి పోలీస్ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.

trs government will fall after 7 months:kishan reddy

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుందన్నారు. పోలీసు అధికారులు పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లో పని చేస్తున్నారని అర్థం అవుతుందన్నారు. ఏడు నెలల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండబోదని కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాట్లు చేసిన వారికి ప్రజలు బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

ఇటు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ వాడుకొని ఎదిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసం పార్టీని, తనను ఎన్నుకున్న ప్రజల్ని మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి కింద కుక్కల్లా కాంగ్రెస్‌లో ఎదిగి న కోమటిరెడ్డి బ్రదర్స్.. చివరికి ద్రోహులుగా మారారని ఘాటుగా విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు కానున్నాయని జోస్యం చెప్పారు.

English summary
central minister kishan reddy made sensational comments. trs government will fall after seven months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X