నేడు అర్దరాత్రి 2గంటలకు ట్రంప్ కీలక ప్రకటన.. సర్వత్రా ఉత్కంఠ!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాల ఆందోళనకు కారణమవుతున్నారు. ముఖ్యంగా భారత్ విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, భారత్ ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇక తాజాగా అనుహ్య ప్రకటనలు చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
భారత్ పైన సుంకాల గురించి ట్రంప్ పదేపదే హెచ్చరికలు
అమెరికా కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు, అంటే భారత్లో అర్ధరాత్రి రెండు గంటలకు ట్రంప్ ఓవల్ ఆఫీసులో కీలక ప్రకటన చేయనున్నారు.
భారత్ పైన సుంకాల గురించి ట్రంప్ పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో నేడు అర్ధరాత్రి ట్రంప్ చేసే ప్రకటన దేని గురించి? ట్రంప్ ప్రకటన భారత్ ను ఏ విధంగా ఇబ్బంది పెట్టబోతోంది? అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతుంది.

భారత్ తీరుతో సంతోషంగా లేనన్న ట్రంప్
మరో 24 గంటల్లో భారత్ పై సుంకాల బాంబు పేలుస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్, న్యూఢిల్లీ తనకు వ్యాపార భాగస్వామి కాదని, భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రష్యా చమురు కొనుగోళ్ల ఒప్పందం నేపథ్యంలో తాను సంతోషంగా లేనని ఆయన ప్రకటించారు. అందుకే భారత్ పైన భారీ సుంకాలు విధించడానికి రెడీ అయ్యానని ట్రంప్ వెల్లడించారు.
నేడు అర్దరాత్రి కీలక ప్రకటన చేయనున్న ట్రంప్
అయితే ఈరోజు అర్ధరాత్రి రెండు గంటలకు ట్రంప్ కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో భారత్ పైన భారీ సుంకాలు విధిస్తారని ప్రస్తుతం అందరిలోనూ చర్చ జరుగుతుంది ఇప్పటికే ట్రంప్ న్యూఢిల్లీ పైన 25% టారిఫ్ లను విధించారు. ఇక ఈరోజు అర్ధరాత్రి ట్రంప్ మరో బాంబు పేల్చనున్న నేపథ్యంలో ఆయన చేసే కీలక ప్రకటనలు ఏ విధంగా ఉంటాయి అన్నది అందరిలోనూ రచ్చ జరుగుతుంది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో అమెరికా ప్రత్యేక రాయబారి చర్చ.. ఆపై కీలక ప్రకటన
ఇదిలా ఉంటే అమెరికా రష్యా ఉద్రిక్తతల మధ్య తాజాగా అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్ కోఫ్ ప్రస్తుతం మాస్కోలో పర్యటిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఆయన చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశం జరిగిన తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. రష్యా కాల్పుల విరమణకు అంగీకరించకపోతే ఆదేశం పైన ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ముఖ్యంగా భారతదేశానికి పెద్ద తలనొప్పిగా తయారైంది.












Click it and Unblock the Notifications