జైలుకెళ్లాల్సిన సమయం: ట్రంప్ హెచ్చరిక, ఎవరిని?

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పాపులర్ సింగర్ స్నూప్ డాగ్ ఓ వీడియో ద్వారా తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం అమెరికావ్యాప్తంగా చర్చనీయాంశం కాగా.. ఇందులో 'రొనాల్డ్ క్లంప్' పేరుతో ఉన్న వ్యక్తిని తుపాకీతో కాల్చినట్లు చూపించారు.

పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్ పేరు ధ్వనించేలా ఉద్దేశపూర్వకంగానే 'రొనాల్డ్ క్లంప్' పేరును ఈ వీడియోలో వాడారు. ఎంత నిరసన రూపమైనా.. మరీ కాల్చివేస్తున్నట్లు చూపించడమేంటని పలువురు వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సైతం ట్విట్టర్ ద్వారా దీనిపై స్పందించారు. 'స్నూప్‌డాగ్‌ కెరీర్‌ నాశనమై.. ఆ కోపంలో అమెరికా మాజీ అధ్య‌క్షుడు ఒబామాను కాల్చేస్తే, దాని ఫలితం ఎలా ఉంటుందో ఊహించగలరా? జైలుకెళ్లాల్సిన సమయం' అంటూ స్నూప్ డాగ్ కు చురకలంటించాడు.

Trump Says Snoop Dogg Video Would've Ended In Jail Time, Calls Career 'Failing'

ట్రంప్‌తో పాటు అమెరికన్ పోలీసుల ఎంత కర్కశంగా వ్యవహరిస్తారో ఈ వీడియో ద్వారా స్నూప్ డాగ్ చూపించాడు. స్నూప్ డాగ్ మాత్రం విమర్శలను సున్నితంగా కొట్టిపారేస్తున్నాడు. తమ బాధను చెప్పుకోలేని అమెరికా వాసుల కోసమే ఈ వీడియో అని, ఈ పాటను వివాదస్పదం చేయాలనుకోవడం లేదని చెప్పారు.

కాగా, అధ్యక్షుడిగా ట్రంప్ ను వ్యతిరేకిస్తున్న చాలామంది అమెరికన్ ప్రజలు ఇప్పటికీ ఆయనపై ఏదో ఒక రూపంలో నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a new video for the slinky, jazz-rooted BADBADNOTGOOD song "Lavender," a character named "Ronald Klump," a satirical Donald Trump stand-in, is the victim of a Looney Tunes-ian "BANG," fired by Snoop Dogg. (The video is also heavy on Snoop's favorite subject, the continuous ingestion of pot.
Please Wait while comments are loading...