భారత్ కు ట్రంప్ బెదిరింపులతో అసలు పెద్దకష్టాలు వాళ్ళకే!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల భారత్‌పై సుంకాలు 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోవడం ప్రధాన కారణమని చెబుతున్నప్పటికీ, ట్రంప్ తీసుకున్న నిర్ణయం వెనుక అనేక కారణాలు ఉన్నాయనేది అందరికీ విదితమే. అయితే, ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అలాస్కాలో జరగనున్న ట్రంప్‌-పుతిన్‌ భేటీ ఫలితాలను బట్టి, ఈ సుంకాలు మరింత పెరిగే అవకాశముందని అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్‌ బిస్సెంట్‌ పేర్కొన్నారు.

ట్రంప్ నిర్ణయాలతో ఆందోళనలో ఇండియన్ స్టూడెంట్స్
ఇదిలా ఉంటే భారతదేశంపై ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, భారత్ పై అదనపు సుంకాలు విధిస్తూ చేస్తున్న ట్రంప్ చర్యలు అమెరికాలో చదువుతున్న విద్యార్థులలో ఆందోళనకు కారణంగా మారుతుంది. ఇండియా అమెరికా మధ్య సత్సంబంధాలు ఉంటే, యూఎస్ లో తమ జీవితం బాగుంటుందని, తాము చదువుకోడానికి, ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుందని, లేదంటే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.

Trump threats to India Indian students under severe pressure

Take a Poll

ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు
లక్షల రూపాయలు చదువుల కోసం ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుని యూఎస్ వెళ్లిన వాళ్లంతా ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇప్పటికే ఇండియా, అమెరికా మధ్య ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి సుంకాలపై తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అమెరికాలో ఉన్న ఇండియన్స్ నిత్యవసర వస్తువులను కొనుగోలు చేయలేకపోతున్నారు.

అప్పటికీ ఇప్పటికీ ఖర్చు పెరిగిందని విద్యార్థుల ఆందోళన
విపరీతంగా నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో తమపై అదనపు భారం పడుతున్నట్టుగా చెబుతున్నారు. గతంలో 150 డాలర్లు పెడితే ఒక వారానికి సరిపడా సరుకులు వచ్చేవని, ఇప్పుడు మూడు నాలుగు రోజులకు కూడా సరుకులు రావడంలేదని యూఎస్ లో చదువుతున్న ఇండియన్ విద్యార్థులు లబోదిబోమంటున్నారు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఉండి, అంతా సవ్యంగా సాగితేనే తమ భవిష్యత్తు బాగుంటుందని లేదంటే తమ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆవేదనలో ఉన్నారు.

ట్రంప్ ప్రధాని మోదీ భేటీపై ఇండియన్ స్టూడెంట్స్ లో ఉత్కంఠ
భారత్ పైన ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను, ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ భారత్ చర్యలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇక వచ్చే నెలలో ట్రంప్ తో ప్రధాని మోదీ భేటీ అవుతారని వస్తున్న వార్తల నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉన్న ఈ సమస్యలు పరిష్కారం కావాలని, లేదంటే ట్రంప్ ప్రభావం తమపైన దారుణంగా ఉండే అవకాశం ఉందని వారు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+