చెన్నైలో శేఖర్ రెడ్డి అరెస్టు: త్వరలో సీఎస్ కొడుకు వివేక్ అరెస్ట్?

మాజీ టిటిడి బోర్డు చైర్మన్ శేఖర్ రెడ్డిని సిబిఐ అధికారులు బుధవారం నాడు అరెస్టు చేశారు. అక్రమ నగదు లావాదేవీల వ్యవహారంలో శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్‌లను చెన్నైలో అరెస్టు చ

చెన్నై: మాజీ టిటిడి బోర్డు చైర్మన్ శేఖర్ రెడ్డిని సిబిఐ అధికారులు బుధవారం నాడు అరెస్టు చేశారు. అక్రమ నగదు లావాదేవీల వ్యవహారంలో శేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్‌లను చెన్నైలో అరెస్టు చేశారు.

శేఖర్ రెడ్డిని కోర్టు ఎదుట ప్రవేశ పెట్టారు. ఆయనకు సిబిఐ న్యాయస్థానం జనవరి 3వ తేదీ వరకు రిమాండు విధించింది. ఇటీవల శేఖర రెడ్డి నివాసం, కార్యాలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించి వందల కోట్ల నగదు, వందల కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

sekhar reddy

నోట్ల రద్దు తర్వాత భారీగా శేఖర్ రెడ్డి భారీగా కొత్త నొట్లతో దొరికిపోయాడు. ఆయన పైన సీబీఐ, ఈడీ సంయుక్తంగా కేసులు నమోదు చేశాయి. నోట్ల మార్పిడి వ్యతిరేక చట్టం కింద శేఖర్ రెడ్డితో పాటు ఆయన భాగస్వాముల పైన కేసులు నమోదయ్యాయి.

చెన్నైలోని టీ నగర్‌లోని శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాలతో పాటు ఆయన సన్నిహితులు, భాగస్వాముల ఇళ్లలో ఇటీవల తనిఖీ చేసిన ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున ఆస్తులు గుర్తించారు. విచారణలో శేఖర్ రెడ్డి ఇచ్చిన వివరాల మేరకు నగరంలోని పలు బంగారు దుకాణాల యజమానుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు.

శేఖర్ రెడ్డి సహా చెన్నైలోని నలుగురు తెలుగు పారిశ్రామికవేత్తల ఇళ్ల పైన ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మరోవైపు, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామ్మోహన్ రావు కొడుకు వివేక్‌తోను శేఖర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వివేక్‌ను కూడా రేపో మాపో అరెస్టు చేయవచ్చని అంటున్నారు. బుధవారం నాడు రామ్మోహన్ రావు కార్యాలయం, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+