టీటీవీ దినకరన్ మెడ మీద ఎన్నికల కమిషన్ కత్తి, హంగామా, నామినేషన్ తిరస్కరిస్తారా ?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఎన్నికల నియమాలు ఉల్లంఘించిన టీటీవీ దినకరన్ కు చుక్కలు చూపించడానికి ఎన్నికల కమిషన్ అధికారులు సిద్దం అయ్యారు. ముందుగా చెప్పినా మాట వినకుండా నానా హంగామా చేసిన టీటీవీ దినకరన్ మీద కఠిన చర్యలు తీసుకుని నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉందని తెలిసింది. దినకరన్ మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్దం అయ్యారు.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి శుక్రవారం టీటీవీ దినకరన్ అట్టహాసంగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. తాను శుక్రవారం నామినేషన్ వేస్తానని బుధవారం టీటీవీ దినకరన్ భారత ఎన్నికల కమిసన్ అధికారులు సమాచారం ఇచ్చారు.

నియమాలు పాటించండి !

నియమాలు పాటించండి !

నామినేషన్ వెయ్యడానికి వచ్చే సమయంలో ఎక్కువ వాహనాల్లో మీ మద్దతుదారులతో రాకూడదని, నాలుగు లేదా ఐదు వాహనాల్లో మాత్రమే మద్దతుదారులను వెంట తీసుకురావాలని ఎన్నికల కమిషన్ అధికారులు టీటీవీ దినకరన్ కు ముందుగానే సూచించారు.

 20 వాహనాల్లో మద్దతుదారులు !

20 వాహనాల్లో మద్దతుదారులు !

టీటీవీ దినకరన్ 20కి పైగా వాహనాల్లో తన మద్దతుదారులతో హంగామా చేస్తూ నామినేషన్ వెయ్యడానికి వచ్చారని ఎన్నికల కమిషన్ అధికారులు గుర్తించారు. నామినేషన్ వేసే కార్యాలయం ముందు టీటీవీ దినకరన్ మద్దతుదారులు వచ్చిన వాహనాలు నిలిపివేశారు.

 మన్నార్ గుడి మాఫియా హంగామా

మన్నార్ గుడి మాఫియా హంగామా

టీటీవీ దినకరన్ మద్దతుదారులు వచ్చిన వాహనాలు రోడ్డు మీద నిలిపివెయ్యడంతో వాహన సంచారం అస్తవ్యస్తం అయ్యింది. నామినేషన్ వేసే ముందు, తరువాత టీటీవీ దినకరన్ కారు మీద నిలబడి తన మద్దతుదారులకు చేతులు ఊపుతూ నానా హంగామా చేశారని అధికారులు గుర్తించారు.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

ఎన్నికల నియమాలు ఉల్లంఘించిన టీటీవీ దినకరన్ మీద చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారి వేలుస్వామి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేస్తే టీటీవీ దినకరన్ సమర్పించిన నామినేషన్ తిరస్కరించి రద్దు చేసే అవకాశం ఎక్కువగా ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.

మొదటికే మోసం, టీటీవీ భవిష్యత్తు ?

మొదటికే మోసం, టీటీవీ భవిష్యత్తు ?

మొత్తం మీద తమిళనాడు ప్రభుత్వం మీద రగిలిపోతున్న టీటీవీ దినకరన్ తన బలం నిరూపించుకోవడానికి 20కి పైగా వాహనాల్లో నామినేషన్ వెయ్యడానికి వెళ్లి కొని కష్టాలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు టీటీవీ దినకరన్ భవిష్యత్తు ఎన్నికల కమిషన్ అధికారుల చేతిలోకి వెళ్లిపోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV Dinakaran nomination may get rejected as he has violated poll code when he filed his nomination

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి