ఢిల్లీ పెద్దలతో పన్నీర్, పళని చర్చలు: ఎమ్మెల్యేలు కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఏం చేస్తారు ?
తమిళనాడు ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అత్యవసరంగా సమావేశం అయ్యారు.
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అత్యవసరంగా సమావేశం అయ్యారు. టీటీవీ దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలను ఎలాగైనా తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్లాన్ వేస్తున్నారు.
బుధవారం తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పలువురు మంత్రులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. శాసన సభలో ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవాలంటే దినకరన్ గ్రూప్ లోని ఐదు మంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకురావాలి.

దినకరన్ వర్గంలోని ఐదు మంది ఎమ్మెల్యేను బయటకు రప్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు ఎమ్మెల్యేలు గొడ దూకకుండా దినకరన్, మన్నార్ గుడి మాఫియా జాగ్రత్తలు తీసుకుంటోంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పుదుచ్చేరి నుంచి దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలను బయటకు రప్పించడం వీలుకాకపోవడంతో తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీలోని కొందరు పెద్దలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఢిల్లీలోని పెద్దల సహకారంతో దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలను తమ దారిలోకి తెచ్చుకోవాలని పళనిసామి, పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications