TV9 Bharatvarsh-Polstrat Exit poll : టీవీ9 భారత్ వర్ష్ సర్వేలో కాంగ్రెస్ కు మొగ్గు..బీజేపీకి రెండో స్ధానం
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా జాతీయ న్యూస్ నెట్ వర్క్ టీవీ 9 భారత్ వర్ష్-పోల్ స్ట్రాట్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ప్రకటించింది. ఇందులో కర్నాటకలో హోరాహోరీ పోరు సాగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ తెలిపింది.
టీవీ 9 భారత్ వర్ష్-పోల్ స్ట్రాట్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం కర్నాటకలో ప్రస్తుతం విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టికి ఈసారి 99-109 స్ధానాలు లభించే అవకాశమున్నట్లు తేలింది. అయితే మ్యాజిక్ మార్క్ కు అవసరమైన 113 స్ధానాలకు కాంగ్రెస్ పార్టీ నాలుగు స్ధానాలకు తక్కువగా నిలిచిపోయే అవకాశాలున్నాయి. అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి ఈసారి 88-98 స్దానాలు మాత్రమే లభించే అవకాశముంది.

కర్నాటకలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో కింగ్ మేకర్ గా నిలిచిన జేడీఎస్ కు కూడా చేదు ఫలితాలు తప్పేలా లేవు. అయినా కీలకంగా మారే అవకాశముంది. టీవీ 9 భారత్ వర్ష్-పోల్ స్ట్రాట్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ కు కేవలం 21-26 సీట్లు లభిస్తాయని తేలింది. దీంతో జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ అయ్యే అవకాశాలూ లేకపోలేదు. టీవీ 9 భారత్ వర్ష్-పోల్ స్ట్రాట్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ప్రకారం ఇతరులకు 0 నుంచి 4 సీట్లు లభించే అవకాశముంది.












Click it and Unblock the Notifications