బీఎల్ సంతోష్, శ్రీనివాస్‌కు సిట్ ఇచ్చిన నోటీసుల్లో ట్విస్ట్: పొరపాటా? నిజం తేల్చేపనా?
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీ కీలక నేతతోపాటు పలువురికి విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ నోటీసుల్లో కొంత గందరగోళం నెలకొనడం గమనార్హం.

ఆ ఇద్దరికి ఓకే ఫోన్ నెంబర్, ఐఎంఈఐతో సిట్ నోటీసులు
ఒకే నెంబర్, ఒకే ఐఎంఈఐ నెంబర్ ఉన్న ఫోన్ తేవాలని బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, కరీంనగర్ నగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే, ఇద్దరికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్న మొబైల్ నెంబర్, అందుకు సంబంధించిన ఐఎంఈఐ నెంబర్లు కూడా ఒకే విధంగా ఉండటం అయోమయానికి తావిచ్చింది.

సిట్ నోటీసుల్లో పొరపాటా? నిజం నిగ్గు తేల్చేందుకా?
అయితే, నోటీసులు జారీ చేసే క్రమంలో కాపీ పేస్టు చేస్తుండగా పొరపాటు జరిగిందా? లేక దర్యాప్తుల భాగంగా ఆ ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవడానికి ఇలా నోటీసులు పంపించారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మెరబెట్టు లక్ష్మీజనార్ధన్(బీఎల్) సంతోష్‌కు సిట్ తాజాగా 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసింది. నవంబర్ 21న హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసులు పేర్కొంది. అంతేగాక, ఒకవేళ హాజరు రాకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

21న సిట్ కీలక విచారణ
బీఎల్ సంతోష్ స్వస్థలం కర్ణాటకలోని ఉడుపి కాగా.. బెంగళూరులోని మల్లేశ్వరం, టెంపుల్ స్ట్రీట్ చిరునామాతో నోటీసు జారీ అయ్యింది. విచారణకు వచ్చేప్పుడు 9449831415 నెంబర్ సిమ్ తోపాటు ఐఎఈఐ నెంబర్ 353846108969790తో కూడిన సెల్‌ఫోన్ ను వెంట తీసుకురావాలని పేర్కొంది. మరోవైపు, కేరళ వైద్యుడు జగ్గుస్వామికి కూడా విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో జగ్గుస్వామి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు గుర్తించింది. నవంబర్ 21వ తేదీన బీజేపీ కీలక నేతలను కూడా విచారిస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, కేసు సంబంధం లేని వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నారంటూ బీజేపీ మండిపడుతోంది.












Click it and Unblock the Notifications