రాహుల్ ట్వీట్ దుమారం-తొలగించాం, అకౌంట్ బ్లాక్ చేశాం-ఢిల్లీ హైకోర్టుకు ట్విట్టర్ వివరణ
ఢిల్లీలో దళిత బాలిక రేప్ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెట్టిన ట్వీట్ పై దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ అభ్యంతరకరమైన ట్వీట్ ను ట్విట్టర్ అప్పుడే తొలగించడంతో పాటు తాత్కాలికంగా రాహుల్ గాంధీ అకౌంట్ ను కూడా నిలిపేసింది. ఆ తర్వాత పునరుద్ధరించింది. అయినా దీనిపై దుమారం ఆగడం లేదు.
రాహుల్ గాంధీ ట్వీట్ లో బాలికతో పాటు తల్లితండ్రుల ఫొటోల్ని కూడా పెట్టడంపై జాతీయ బాలల హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఐటీ రూల్స్ ప్రకారం ఈ ట్వీట్ పై తీసుకున్న చర్యల విషయంలో ట్విట్టర్ కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టుకు ట్విటర్ ఇవాళ వివరణ ఇచ్చింది. రాహుల్ పెట్టిన అభ్యంతర కర ట్వీట్ ను తాము తొలగించినట్లు ట్విట్టర్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

రాహుల్ గాంధీ పెట్టిన వివాదాస్పద ట్వీట్ ను తొలగించడంతో పాటు ఆగస్టు న ఆయన అకౌంట్ ను కూడా నిలిపేసినట్లు ట్విట్టర్ ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన వివరణలో పేర్కొంది. ఈ విషయంలో కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోయినా తమంతట తామే చర్యలు తీసుకున్నట్లు ట్విట్టర్ తెలిపింది. ట్విట్టర్ వివరణ అందిన తర్వాత రాహుల్ పై చర్యలు కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. ఈ కేసులో సామాజిక కార్యకర్త కూడా అయిన పిటిషనర్ రాహుల్ గాంధీ బాలికతో పాటు ఆమె తల్లితండ్రులు, తన ఫొటోను పెట్టడం ద్వారా జువైనల్ జస్టిస్ చట్టాన్ని ఉల్లంఘించారని పిటిషన్లో ఆరోపించారు. అలాగే పోస్కో చట్టాన్ని కూడా అతిక్రమించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ రెండు ఉల్లంఘనలపై రాహుల్ గాంధీని శిక్షించాలని కోర్టును కోరారు.












Click it and Unblock the Notifications