సూపర్ కాప్: మంటల్లోనుంచి చిన్నారిని ఎత్తుకుని పరుగెత్తుకుంటూ కాపాడిన కానిస్టేబుల్
జైపూర్: మంటల్లో చిక్కుకున్న ఓ చిన్నారిని ప్రాణాలు తెగించి కాపాడారు రాజస్థాన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్. చుట్టూ మంటలు చెలరేగుతున్నా.. ఇరుకైన సందులగుండా వేగంగా పరిగెత్తి చిన్నారి ప్రాణం కాపాడారు. ఇప్పుడు ఆ దృశ్యాన్ని షామిలికి చెందిన ఐపీఎస్ అధికారి సుకీర్తి మాధవ మిశ్రా నెట్టింట్లో షేర్ చేశారు. దీంతో ఈ దృశ్యం వైరల్‌గా మారింది. ఈ సదరు కానిస్టేబుల్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 2న రాజస్థాన్ రాష్ట్రంలోని కరౌలీ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. హిందూ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని నిర్వహిస్తోన్న మోటార్ సైకళ్లి ర్యాలీపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. దీంతో చెలరేగిన ఘర్షణల్లో కొందరు దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. అప్పుడు అక్కడ చిక్కుకుపోయిన ఓ చిన్నారిని రక్షించేందుకు కానిస్టేబుల్ నేత్రేశ్ శర్మ సాహసం చేశారు.

'ర్యాలీ సమయంలో ఒక్కసారిగా ఎవరో రాళ్లు విసిరారు. అప్పుడు రోడ్డుపై గాయపడిన ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు ఆసుపత్రికి తీసుకెళ్లమని అభ్యర్థించగా నేను వారికి సహకరించాను. అప్పుడే షాపులకు నిప్పు అంటుకున్నాయి. రెండు షాపుల మధ్య ఒక ఇల్లు ఉండటాన్ని నేను గ్రహించాను. ఆ ఇంట్లో చేతిలో పసిబిడ్డతో మహిళలు చిక్కుకుపోయి ఉన్నారు. వెంటనే వారి దగ్గరకు పరిగెత్తాను. నన్ను చూసిన వెంటనే వారు కాపాడమని అభ్యర్థించారు. నేను ఆ బిడ్డను తీసుకొని, నా వెనకాలే వారిని వచ్చేయమని చెప్పాను. అలా ఆ చిన్నారిని బయటకు తీసుకువచ్చి వారికి అప్పగించాను. ఇది కేవలం నా బాధ్యత' అని నేత్రేశ్ శర్మ హుందాగా చెప్పారు.
एक मां को साथ लिए, सीने से मासूम को चिपकाए दौड़ते खाकी के कदम।#RajasthanPolice के कांस्टेबल नेत्रेश शर्मा के जज्बे को सलाम।
— Rajasthan Police (@PoliceRajasthan) April 3, 2022
करौली उपद्रव के बीच आमजन की सुरक्षा पुख्ता करने में जुटी पुलिस। @RajCMO @DIPRRajasthan @KarauliPolice pic.twitter.com/XtYcYWgZWs
కాగా, 'ఓ విలువైన ప్రాణాన్ని కాపాడిన రాజస్థాన్ పోలీస్ నేత్రేశ్ శర్మ పట్ల గర్వంగా ఉంది. మాటల్లో వర్ణించలేని విషయాన్ని ఈ ఒక్క చిత్రం ప్రతిబింబిస్తుంది' అని ప్రశంసల వర్షం కురిపించారు ఐపీఎస్ అధికారి సుకీర్తి మాధవ మిశ్రా. మరోవైపు ఆందోళనలు అదుపు చేసేందుకు కరౌలీ ప్రాంతంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవలకు పాక్షికంగా పరిమితులు పెట్టింది. 50 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications