వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron virus:రెండు డోసులు తీసుకోవాలి.. లేదంటే ఆర్టీపీసీఆర్: మహారాష్ట్ర ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ బెంబేలెత్తిస్తోంది. ఇదీ డెల్టా కన్నా ప్రమాదకరం కావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తమ రాష్ట్రానికి వచ్చే వారు రెండు డోసులు తీసుకున్న.. లేదంటే ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకున్న వారికి మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టంచేసింది.

విదేశాల నుంచి వచ్చే వారిపై ఫోకస్ చేస్తున్నారు. విమానాశ్రయాల్లో వచ్చే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి వచ్చే వారిపై ఆంక్షలు విధించింది. కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారికు ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేస్తోంది. ఆర్టీ పీసీఆర్ రిపోర్టుతోనే రావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది.

two dose vaccine mandatory who come to maharashtra

గతంలో కరోనా వైరస్ ఉధృతిలో కేరళ తర్వాత మహారాష్ట్రలోనే అధికంగా కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. మరణాలు కూడా అదేస్థాయిలో ఉండడంతో అప్పట్లో ప్రభుత్వం కఠినమైన నిబంధనలు అమలు చేసింది. కొన్ని రోజులు లాక్ డౌన్ విధించింది. కంటైన్ మెంట్ జోన్లుగా ఏర్పాటు చేయడం..పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా జోరుగా కొనసాగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు రావడంతో నియమ, నిబంధనలు సడలించింది. అకస్మాత్తుగా కొత్త వేరియంట్ వెలుగులోకి రావడంతో..అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.

కొత్త వేరియంట్‌ను ఒమ్రికాన్ అని పిలుస్తున్నారు. 50 ఉత్పరివర్తనాలు, స్పైక్ ప్రొటీన్‌లో 30 కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్పైక్ ప్రొటీన్ల ద్వారానే వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అందుకే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు వీటిని లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తాయి. ఇంకొంచెం లోతుగా చూస్తే రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో 10 ఉత్పరివర్తనాలు కనిపించాయి. మన శరీరంలోని కణాలను ముందుగా తాకేది వైరస్‌లో ఉన్న ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైనే. ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా వేరియంట్‌లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో రెండే ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్థాయిలో మ్యుటేషన్లు, వైరస్‌తో ఏ మాత్రం పోరాడలేని ఒక రోగి శరీరం నుంచి బయటపడి ఉండవచ్చు. అయితే, చాలా రకాల మ్యుటేషన్లు చెడ్డవి కాకపోవచ్చు. ఇవి ఎలా పనిచేస్తున్నాయన్నది గమనించాల్సి ఉంటుంది.

English summary
two dose vaccine mandatory who come to maharashtra government clarity. if not take 2 doses.. rtpcr test is compulsory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X